హైదరాబాద్లోని అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం.. రెండు ఫ్లాట్లలో గ్యాస్ సిలిండర్లతో పాటు పేలిన AC కంప్రెషర్లు

హైదరాబాద్లోని అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం.. రెండు ఫ్లాట్లలో గ్యాస్ సిలిండర్లతో పాటు పేలిన AC కంప్రెషర్లు

హైదరాబాద్: హైదరాబాద్లోని అపార్ట్మెంట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రెండు ఫ్లాట్లలో గ్యాస్ సిలిండర్లతో పాటు AC కంప్రెషర్లు పేలిపోయాయి. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నయాన్ ఇన్ఫ్రా అపార్ట్మెంట్లో ఈ ఘటన జరిగింది. 4వ ఫ్లోర్లో ఎదురెదురుగా ఉన్న 2 ఫ్లాట్లలో గ్యాస్ సిలిండర్లతో పాటు ఏసీ కంప్రెషర్లు పేలడం వల్లే ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

ఇంట్లో దేవుడి దగ్గర పెట్టిన దీపం అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. ఇంట్లోని కబోర్డ్స్, సీలింగ్, జిప్సమ్ షీట్లకు మంటలు అంటుకోవడంతో  దాదాపు 25 లక్షల ఆస్తి నష్టం జరిగింది. ఫైర్ సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజన్స్ సహాయంతో మంటలు ఆర్పుతున్నారు.