టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత జీవితంలో ఇప్పుడు అత్యంత మధురమైన ఘట్టం ఆసన్నమైంది. భర్త, దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి త్వరలోనే తమ మొదటి బిడ్డకు స్వాగతం పలకబోతోంది. ప్రస్తుతం మాతృత్వపు మధురానుభూతులను ఆస్వాదిస్తోంది. ఈక్రమంలో తమ ఇంట్లో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలను లేటెస్ట్ గా సమంత షేర్ చేయగా .. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తమ తొలి బిడ్డ రాకకు ముందు కుటుంబ సభ్యుల సమక్షంలో సమంత, రాజ్ తమ ఇంట్లో ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు, సన్నిహితులు హాజరయ్యారు. ఎరుపు రంగు ఎంబ్రాయిడరీ సూట్లో సమంత ఎంతో అందంగా కనిపించగా.. తెల్లటి కుర్తాలో రాజ్ ఆకట్టుకున్నారు. ఇద్దరూ ఒకరినొకరు ఆప్యాయంగా చూసుకుంటున్న ఫొటో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
కుటుంబ పెద్దలు సమంత తలపై చేతులు ఉంచి ఆశీర్వదించారు. అనంతరం కుటుంబ సభ్యులందరితో కలిసి దంపతులు ఫొటోలకు పోజులిచ్చారు. ఈ అందమైన క్షణాలను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్న సమంత.. 'Us' అంటూ వైట్ హార్ట్ ఎమోజీలను జోడించారు. దీంతో అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇప్పటికే సెప్టెంబర్లో సమంత సంప్రదాయ సీమంతం వేడుకను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ విద్యా సంప్రదాయానికి చెందిన 'కళా ఆవరణ (శ్రీ కల్పం)' పూజ విశిష్టతను కూడా ఆమె వివరించారు. ప్రతి మంత్రం, ప్రతి సమర్పణకు ప్రత్యేక అర్థం ఉందని, కాబోయే తల్లిని దేవీ స్వరూపంగా గౌరవించే ఆచారమని పేర్కొన్నారు.
ALSO READ : తెలుగు ఓటీటీ చరిత్రలో సరికొత్త రికార్డ్..
ఇక జూన్ 2026లో 'మా ఇంటి బంగారం' సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా సమంత తన ప్రెగ్నెన్సీని ధృవీకరించారు. బిడ్డ పుట్టిన తర్వాత కొంతకాలం సినిమాలకు విరామం తీసుకుని తిరిగి ప్రేక్షకుల ముందుకు వస్తానని తెలిపారు. డిసెంబర్లో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో.. సమంత, రాజ్ జీవితాల్లోకి కొత్త అతిథి ఎప్పుడొస్తాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు...
