అమ్మకానికి కోల్‌కతా నైట్‌రైడర్స్.. రూ.3,800 కోట్లకు 22.5% సేల్! షారుఖ్ వాటా ఎంతంటే?

అమ్మకానికి కోల్‌కతా నైట్‌రైడర్స్.. రూ.3,800 కోట్లకు 22.5% సేల్! షారుఖ్ వాటా ఎంతంటే?

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) సహ యజమానిగా ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఫ్రాంచైజీలో భారీ యాజమాన్య మార్పు (Ownership Deal) చోటు చేసుకోబోతోంది. ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు అమెరికాకు చెందిన ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ ఏరిస్ మేనేజ్‌మెంట్ (Ares Management) కేకేఆర్‌లో 22.5 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఈ ఆల్-క్యాష్ డీల్ విలువ సుమారు 400 మిలియన్ డాలర్లు (రూ.3,736 కోట్లు) అని క్రిక్‌బజ్ నివేదిక పేర్కొంది.

షారుఖ్ వాటా సేఫ్.. అమ్ముతోంది ఎవరంటే: 

* ఈ డీల్‌తో షారుఖ్ ఖాన్ కేకేఆర్‌ను వదిలేస్తున్నారనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదు.

* షారుఖ్ ఖాన్ (55% వాటా): షారుఖ్ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ తన దగ్గర ఉన్న 55 శాతం మెజారిటీ వాటాను అలాగే ఉంచుకుంటోంది. జట్టుపై పూర్తి నియంత్రణ షారుఖ్ వద్దే ఉంటుంది.

* జూహీ చావ్లా, జే మెహతా (45% లో సగం సేల్): కేకేఆర్‌లో మిగిలిన 45 శాతం వాటా నటి జూహీ చావ్లా, ఆమె భర్త జే మెహతాలకు చెందిన మెహతా గ్రూప్ దగ్గర ఉంది. ఇందులో సగం అంటే 22.5 శాతం వాటాను వారు ఏరిస్ మేనేజ్‌మెంట్‌కు విక్రయిస్తున్నారు.

ఎవరీ ఏరిస్ మేనేజ్‌మెంట్: 

అమెరికా కేంద్రంగా పని చేసే ఏరిస్ మేనేజ్‌మెంట్‌కు అంతర్జాతీయ క్రీడా రంగంలో భారీ పెట్టుబడులు ఉన్నాయి. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ క్లబ్ చెల్సియా (Chelsea), ఎన్ఎఫ్ఎల్ (NFL) జట్టు మియామి డాల్ఫిన్స్ (Miami Dolphins) లోనూ ఈ సంస్థకు వాటాలు ఉన్నాయి. ఇప్పుడు ఐపీఎల్‌లో అడుగు పెట్టేందుకు BCCI అధికారిక అనుమతి కోసం వేచి చూస్తోంది.

ALSO READ : 6, 6, 6, 6, 6, 6, 6: యశ్ ధుల్ తుఫాన్ బ్యాటింగ్..

24 రెట్లు పెరిగిన KKR విలువ: 

ఈ డీల్ ప్రకారం కోల్‌కతా నైట్ రైడర్స్ మొత్తం మార్కెట్ విలువ ఏకంగా 1.78 బిలియన్ డాలర్లు (సుమారు రూ.16,634 కోట్లు)గా తేలింది. ఇటీవల ఆర్సీబీ (రూ.16,660 కోట్లు), రాజస్థాన్ రాయల్స్ (రూ.15,660 కోట్లు) భారీ ధరలకు అమ్ముడుపోయిన జాబితాలో ఇప్పుడు కేకేఆర్ కూడా చేరింది.