మళ్లీ మళ్లీ రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా ఎక్కువ రోజులు వాలిడిటీ కావాలనుకునే వారికి ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL ఒక బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. సాధారణంగా ఏడాదికి ఒకసారి రీఛార్జ్ చేసుకునే వారికీ ఇప్పుడు మరో 30 రోజుల ఎక్స్ట్రా వ్యాలిడిటీ లభిస్తోంది. అంటే, ఒకసారి రీఛార్జ్ చేస్తే ఏకంగా 395 రోజుల పాటు వాలిడిటీ పొందొచ్చు.
ముఖ్యంగా ఎక్కువగా ఇంటర్నెట్ ఉపయోగించే వారు, రోజూ ఫోన్ కాల్స్ చేసేవారు, అలాగే ప్రతినెల రీఛార్జ్ చేసుకోవడం ఇష్టం లేని వారికి ఈ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. ఇంతకీ ఈ ప్లాన్ ధర ఎంత ? ఇందులో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి ? ఎప్పటి వరకు ఈ ఆఫర్ ఉంటుంది? వివరంగా తెలుసుకుందాం....
రూ.2,799 ప్లాన్‌తో 395 రోజుల వ్యాలిడిటీ
BSNL తీసుకొచ్చిన ఈ ఆఫర్ ఏంటంటే రూ.2,799తో అన్యువల్ రీఛార్జ్ చేసుకునే వారికీ మొత్తం 395 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది అంటే 12 బదులు 13 నెలలు. సాధారణంగా ఈ ప్లాన్ ద్వారా 365 రోజుల (1 ఏడాది) వ్యాలిడిటీ మాత్రమే వచ్చేది. అయితే ప్రస్తుతం కంపెనీ అదనంగా మరో 30 రోజుల వ్యాలిడిటీ ఉచితంగా ఇస్తోంది. దీంతో కస్టమర్లు ఒకేసారి రీఛార్జ్ చేసుకుంటే దాదాపు 13 నెలల పాటు మళ్ళి రీఛార్జ్ చేయాల్సిన పని లేదు. ఇంకా ఒకేసారి రీఛార్జ్ చేస్తే ఏడాదికి పైగా రీఛార్జ్ టెన్షన్ లేకుండా ఉండాలనుకునే వారికి మంచి అప్షన్ అని చెప్పవచ్చు.
రోజూ 3GB హైస్పీడ్ డేటా.. డేటా అయిపోయినా నో టెన్షన్
ఈ ప్లాన్‌లో మరో ముఖ్యమైన ప్రయోజనం డైలీ డేటా లిమిట్.. యూజర్లకు ప్రతిరోజూ 3GB హైస్పీడ్ డేటాను BSNL అందిస్తోంది. ఈ డేటాతో రోజూ వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్స్ ఉపయోగించుకోవచ్చు. యూట్యూబ్ వీడియోలు చూడటం, ఆన్‌లైన్‌లో బ్రౌజింగ్ చేసుకోవచ్చు.
ఆన్ లిమిటెడ్ కాల్స్, SMSలు కూడా
డేటాతో పాటు కాలింగ్ ప్రయోజనాలు కూడా ఈ ప్లాన్‌తో ఇస్తున్నారు.
* దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు.
* ప్రతిరోజూ 3GB హైస్పీడ్ ఇంటర్నెట్ డేటా లభిస్తుంది.
* ప్రతిరోజూ 100 మెసేజ్‌లు పంపుకోవచ్చు.
* ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే దాదాపు 13 నెలల (395 రోజుల) పాటు ప్లాన్ వ్యాలిడిటీ పొందవచ్చు.
ఈ ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే
ఈ ఆఫర్‌కు సంబంధించి మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ అఫర్ కొద్దిరోజులు మాత్రమే ఉంటుంది. BSNL సమాచారం ప్రకారం, ఈ ఎక్స్ట్రా 30 రోజుల వ్యాలిడిటీ ఆఫర్ నవంబర్ 30, 2026 వరకు మాత్రమే లభిస్తుంది. కాబట్టి రూ.2,799తో 395 రోజుల పాటు రీఛార్జ్ ప్రయోజనాలు పొందాలనుకునే కస్టమర్లు గడువులోగా ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చు.
ALSO READ : మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామనుకుంటున్నారా..
మొత్తానికి రూ.2,799కే 395 రోజుల వ్యాలిడిటీ, ప్రతిరోజూ 3GB డేటా, ఆన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు ఈ ప్లాన్‌లోని హైలెట్ బెనిఫిట్స్. అయితే రీఛార్జ్ చేసుకునే ముందు మీ ప్రాంతంలో ఈ ఆఫర్ ఉందో లేదో, ఎక్స్ట్రా వ్యాలిడిటీ నిబంధనలు ఏమిటో BSNL అధికారిక వెబ్‌సైట్ లేదా కస్టమర్ కేర్ ద్వారా తెలుసుకోవడం మంచిది.
