సిద్దిపేటలో సీఎం పాదయాత్ర

సిద్దిపేటలో సీఎం పాదయాత్ర

సిద్దిపేట:  సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటనలో భాగంగా ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి  నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సభా ప్రాంగణానికి పాదయాత్రగా బయలుదేరారు.ముస్తాబాద్ చౌరస్తా నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సభాస్థలికి సీఎం పాదయాత్ర కొనసాగిస్తున్నారు.

ముఖ్యమంత్రి వెంట మంత్రి వివేక్, పొంగులేటి, దామోదర రాజనర్సింహా, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్   పలువురు  కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ర్యాలీ మార్గంలో కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేస్తూ సందడి చేస్తున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్రతో సిద్దిపేటలో రాజకీయ సందడి నెలకొంది. సభా ప్రాంగణానికి చేరుకున్న అనంతరం సీఎం బహిరంగ సభలో పాల్గొననున్నారు.