చాలా పుణ్యదినం: నవంబర్ 20.. దేవుత్తని ఏకాదశి.. ఈ నియమాలు పాటిస్తే స్వర్గానికే..!

చాలా పుణ్యదినం:  నవంబర్ 20.. దేవుత్తని ఏకాదశి.. ఈ నియమాలు పాటిస్తే స్వర్గానికే..!

పురాణాల ప్రకారం కార్తీకమాసం నెల రోజులు చాల విశిష్టమైనవి.  ఈ మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశి రోజు శ్రీ మహా విష్ణువు యోగ నిద్రనుంచి మేల్కొంటాడు. ఆషాఢమాసం శయన ఏకాదశి రోజు యోగ నిద్రకు ఉపక్రమించిన పరమాత్ముడు   ప్రబోధిని ఏకాదశి రోజున యోగనిద్రను వీడతాడని పండితులు చెబుతున్నారు.  ఈ రోజునే  దేవుత్తని ఏకాదశి అని కూడా అంటారు.ఈ ఏడాది అలాంటి పవిత్రమైన రోజు నవంబర్​ 20 వతేదీ వచ్చింది. ఆ రోజున కొన్ని నియమాలు పాటిస్తే మరణానంతరం స్వర్గానికే వెళతారని పండితులు చెబుతున్నారు.

కార్తీకమాసంలో శ్రీహరి మేల్కొనడంతోనే హిందూ సంప్రదాయంలో అన్ని రకాల శుభకార్యాలు మళ్లీ మొదలవుతాయి. ఏటా అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించే ఈ పర్వదినం విశిష్టత, ఈ రోజు పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

దేవ ఉత్తాన ఏకాదశి ముహూర్తం

  • కార్తీకమాసం శుద్ద ఏకాదశి తిథి ప్రారంభం: నవంబర్​ 20 వతేది ఉదయం  07:15 గంటలకు
  • కార్తీకమాసం శుద్ద ఏకాదశి తిథి ముగింపు: నవంబర్ 21వ తేదీ ఉదయం 06:31 గంటల వరకు
     

దేవుత్తని ఏకాదశి రోజున క్షీరాబ్ధి యోగంతో పాటు శ్రీమహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొంటారు. ఈ పవిత్ర రోజున ఏకాదశి వ్రతం ఆచరించి, కొన్ని నిషేధిత పనులకు దూరంగా ఉండటం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.

హిందూ మతంలో ఏకాదశి తిథికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశులు శుభకరం అని భావిస్తారు. అయితే ఒకొక్క ఏకాదశికి ఒకొక్క విశిష్టత ఉంది. మంగళకరమైన కార్తీకమాసం శివకేశవులకు ప్రీతిపాత్రమైన మాసం. అయితే ఈ కార్తీకశుద్ధ ఏకాదశికే భోధన ఏకాదశి, దేవ-ప్రబోధిని ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అని కూడా అంటారు.

 ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక ఏకాదశి ( నవంబర్ 20) రోజునే మేల్కొంటాడని పురాణ కథనం. అదేరోజు విష్ణువు తిరిగి సృష్టిని తిరిగి చేపట్టాడని.. నమ్మకం. అందుకనే.. కార్తీక ఏకాదశి నుంచి తిరిగి వివాహాది కార్యక్రమాలు, గృహ ప్రవేశం వంటి శుభకార్యాలు చేపడతారు. అయితే మిగతా ఏకాదశిల కంటే ఈ ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని భక్తుల విశ్వాసం. ఈ రోజున ఉపవాసం దీక్ష చేసేవారు స్వర్గానికి చేరుకుంటారని .. శ్రీ మహావిష్ణువు కొలువైన వైకుంఠాన్ని పొందుతారని నమ్మకం.

ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తిని భక్తిశ్రద్ధలతో పూజించి, ఉపవాసం ఉండి, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం విశేషంగా భావిస్తారు. తులసి మొక్కను సాలగ్రామ స్వరూపమైన శ్రీమహావిష్ణువుతో కలిపి తులసి కళ్యాణం నిర్వహిస్తారు. అన్నదానం, వస్త్రదానం వంటి సేవా కార్యక్రమాలు చేయడం కూడా శుభప్రదమని భక్తుల నమ్మకం. ఆరోగ్యాన్ని బట్టి వ్రత నియమాలు పాటిస్తూ శ్రీహరి నామస్మరణలో గడపాలి. 

నవంబర్​ 20 వతేదీ పాటించాల్సిన నియమాలు 

 

  • ఉత్థాన ఏకాదశి రోజున ( నవంబర్ 20) సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి ఉపవాస వ్రతం చేపట్టాలి.
  • దేవుత్తని ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువుకు తెల్లని పదార్ధాలను నైవేద్యాలు సమర్పించండి.
  •  ఈ రోజున ఖీర్ లేదా ఏదైనా తెలుపు రంగు మిఠాయిలను సమర్పించండి. విష్ణువుకి తెల్లని పదార్ధాలు అంటే ఇష్టం.. కనుక భక్తులపై అనుగ్రహం కురిపిస్తాడు.
  • ఈ రోజున నిర్జల ఉపవాసం ఉంచడం వల్ల విష్ణువు సంతసించి కోరిన కోర్కెలు తీరుస్తాడు.
  • రోజంతా హరినామస్మరణతోనే గడపాలి
  • ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని జాగరణ చేయాలి.
  • అవకాశాన్ని బట్టి నదీస్నానం చేయాలి

దేవుత్తని ఏకాదశి ( నవంబర్ 20)నాడు చేయకూడని పనులు

  • దేవుత్తని ఏకాదశి రోజున అన్నం పొరపాటున కూడా తినకూడదు. 
  • ఏకాదశి వ్రతం పాటించే వ్యక్తి  ముందు రోజు సాయంత్రం నుంచి అన్నం తీసుకోవడం మానేయాలి.
  • ఉపవాస సమయంలో ఎవరిపైనా ద్వేషం లేకుండా చూసుకోండి. 
  • ఈ రోజున, వృద్ధులకు సహాయం చేయడం ద్వారా లక్ష్మీదేవి సంతోషిస్తుంది.
  • దేవుత్తని ఏకాదశి రోజున తులసి మాతకు శాలిగ్రామంకు వివాహం కార్యక్రమం నిర్వహించండి. 
  • ఏకాదశి రోజున తులసిని పూజించడం మరచిపోవద్దు
  • ఈ రోజున ఇంట్లో కానీ, బయట కానీ ఎవరితోనూ గొడవ పడకూడదు. లక్ష్మీదేవి కోపానికి గురవుతారని నమ్మకం.
  • మద్యం.. ధూమపానం జోలికి అస్సలు వెళ్లవద్దు
  • ఎట్టి పరిస్థితిలో అబద్దాలు ఆడకూడదు

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.