సినిమా హిట్ కావాలంటే స్టోరీ, స్క్రీన్ ప్లే ఎంత ముఖ్యమో.. ప్రేక్షకుల్లో ఆ సినిమాపై ఆసక్తి పెంచే ప్రమోషన్స్ కూడా అంతే ముఖ్యం. అయితే ఈ విషయాన్ని తనకంటే బాగా తెలిసిన దర్శకుడు మరొకరు లేరేమో! సినిమా విడుదలకు ముందే తనదైన క్రేజీ ఐడియాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ.. సగం సినిమాను ప్రమోషన్స్‌తోనే జనాల్లోకి తీసుకెళ్లే టాలెంట్ అనిల్ రావిపూడి సొంతం. తనదైన కామెడీ టైమింగ్, చిలిపి పంచులు, వైరల్ అయ్యే కాన్సెప్టులతో మరోసారి ప్రమోషన్ రంగంలోకి దిగిన ఆయన.. తాజాగా వదిలిన వీడియోతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.
ఈసారి దళపతి సీన్‌తో అనిల్ రచ్చ!
వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న "జనవరి 12 విడుదల" మూవీ ప్రమోషన్స్‌లో మరోసారి తనదైన మార్క్ చూపించారు. మణిరత్నం ‘దళపతి’ సినిమాలో రజనీకాంత్, శోభన మధ్య జరిగే సంభాషణ సన్నివేశాన్ని అనిల్ రావిపూడి, కృతి శెట్టి రీక్రియేట్ చేశారు. ఈ వీడియోలో అనిల్ తనదైన కామెడీ టైమింగ్‌తో చెప్పిన మాటలు, కీర్తి సురేశ్ వేసిన పంచ్‌లు నవ్వులు పూయిస్తున్నాయి.
ఇందులో అనిల్ తనదైన స్టైల్లో సందడి చేయగా.. ‘ప్రమోషన్స్ అంటే చాలు.. ప్రతిదానికి వచ్చేస్తాడు’ అంటూ కీర్తి సురేశ్, కృతి శెట్టి వేసిన పంచ్‌లు నవ్వులు పూయిస్తున్నాయి. అంతేకాదు.. అనిల్ రావిపూడి తిడుతుంటేకృతి శెట్టి నవ్వడం, ఆయన తిట్లు కూడా అంత స్వీట్‌గా ఉంటాయా? అన్నట్టుగా సాగిన ఈ సరదా సన్నివేశాలు వీడియోకు మరింత హైలైట్‌గా నిలిచాయి. దీంతో కీర్తి సురేశ్ ఎంట్రీ ఇచ్చి ‘ఇది మన గర్ల్స్ సాంగ్.. రా డ్యాన్స్ వేద్దాం’ అనే డైలాగ్ కూడా వీడియోలో హైలైట్‌గా నిలిచింది. ఈ వీడియోతో నవంబర్ 20 నుంచి మ్యూజికల్ ప్రమోషన్స్.. లేడీస్ సాంగ్ తో షురూ కానున్నట్లు ప్రకటించారు.
ఎలా అండి అనిల్ ఇలా:
నిజానికి అనిల్ రావిపూడి సినిమాలు అంటేనే.. ప్రమోషన్స్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచడం. అనిల్ తన స్టైల్ ఫన్ని జోడిస్తూ ఆడియన్స్‌కి నచ్చేలా, వైరల్ అయ్యేలా ప్రమోషన్స్ చేస్తుంటాడు. ఈ ఫార్ములా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి బాగా వర్కౌట్ అయింది. ఇటీవలే అదే పంథాని మన శంకర వరప్రసాద్ కోసం కూడా వాడి భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇందులో భాగంగా లేటెస్ట్గా ఈ క్రేజీ వీడియోతో మరోసారి "జనవరి 12 విడుదల" మూవీని చర్చించుకునేలా చేసాడు అనిల్ రావిపూడి. ముఖ్యంగా అనిల్.. పాత సినిమాల్లోని సన్నివేశాలను తన ప్రమోషన్స్‌కు క్రియేటివ్‌గా ఉపయోగించుకోవడం ప్రత్యేకతగా మార్చుకున్నాడు. టైటిల్ విడుదల చేసేందుకు EVV ఐడియాని, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో చెప్పడానికి జంధ్యాల ఐడియాని.. వాళ్ళ ఐకానిక్ సినిమాల సీన్లతో రీ క్రియేట్ చేసాడు. ఇప్పుడు తాజాగా మణిరత్నం మూవీ సీన్లను గుర్తుచేస్తూ తనదైన కామెడీని జోడించడం ఆసక్తికరంగా మారింది. ఇలా ప్రతిసారీ ఏదో ఒక కొత్త ఐడియాతో ప్రేక్షకుల ముందుకు వస్తూ.. సినిమా విడుదలకు ముందే సోషల్ మీడియాలో హడావుడి మొదలుపెడుతున్నారు.
సంక్రాంతికి థియేటర్లు కళకళలాడాల్సిందే.
ఇక తాజాగా కృతి శెట్టి, కీర్తి సురేశ్‌లతో చేసిన ఈ వీడియో చూస్తుంటే.. జనవరి 12న సినిమా విడుదలయ్యే సమయానికి ప్రమోషన్స్ ఏ రేంజ్లో ఉంటాయోనని అభిమానులు ఇప్పటి నుంచే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'ఇది కదా కావాల్సిన ఊపు.. సంక్రాంతి గొబ్బెమ్మలు కళకళలాడిపోతున్నారు.. బాక్సాఫీస్ బద్దలే' అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి సినిమా ప్రమోషన్స్‌లో మరోసారి తన ట్రేడ్‌మార్క్ చూపించిన అనిల్ రావిపూడి.. ఈసారి ఏ రేంజ్లో సందడి చేస్తారో చూడాలి!
సంక్రాంతికి వచ్చే మన సినిమా పేరు… ☺️ "జనవరి 12 విడుదల" - బావ బామ్మర్ది సౌజన్యంతో 🤩 -- https://t.co/iuqICLlzx0 #January12Vidudala Grand Release worldwide for SANKRANTHI on JANUARY 12th 2027 💥 Victory @VenkyMama @NANDAMURIKALYAN @AnilRavipudi @KeerthyOfficial @IamKrithiShetty @gvprakash @sahugarapati7 @YoursSKrishna @Shine_Screens @ZeeStudios_ @SureshProdns @zeestudiossouth @zeemusicsouth #NileshDeorah @girishjohar #AmeetBhuvan @IamDivyaVijay @HaashtagMedia @UrsVamsiShekar
— Shine Screens (@Shine_Screens) August 19, 2026
