తెలంగాణలోని ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. 2027ఫిబ్రవరి 24 నుంచి మార్చి 20 వరకు ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
షెడ్యూల్ ప్రకారం..2027 ఫిబ్రవరి 24న ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు తొలి పరీక్ష జరగనుంది. ఫిబ్రవరి 25న సెకండ్ ఇయర్ విద్యార్థులకు మొదటి పరీక్ష నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.
ఇక సైన్స్ విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి 18 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు పరీక్షల షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలని సూచిస్తున్నారు. ఇంటర్ బోర్డు విడుదల చేసిన టైమ్‌టేబుల్‌తో పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల్లో పరీక్షల సందడి మొదలైంది.
