నార్సింగ్ లోని హైరైజ్ టవర్స్ లో మంటలు : పరుగులు తీసిన అపార్ట్ మెంట్ వాసులు

నార్సింగ్ లోని హైరైజ్ టవర్స్ లో మంటలు : పరుగులు తీసిన అపార్ట్ మెంట్ వాసులు

హైదరాబాద్ సిటీ ఉలిక్కి పడింది. సిటీ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని నార్సింగ్ ఏరియాలో ఎటు చూసినా హైరైజ్ టవర్స్ అపార్ట్ మెంట్స్.. ఇలాంటి హైరైజ్ అపార్ట్ మెంట్స్ లో మంటలు చెలరేగాయి. నార్సింగ్ లోని హిల్ క్రెస్ట్ హైరైజ్ అపార్ట్ మెంట్ వెంచర్ ఉంది. ఇందులోని ఓ టవర్ లో అగ్ని ప్రమాదం.. భారీగా మంటలు చెలరేగటంతో చుట్టుపక్కల వాళ్లు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. 

నార్సింగ్ లోని హిల్ క్రెస్ట్ హైరైజ్ అపార్ట్ మెంట్స్ లోని ఓ టవర్ లోని ఓ ప్లాట్ లో మొదట మంటలు వచ్చాయి. ఆ ప్లాట్ నుంచి మంటలు పై ప్లాట్లకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో నాలుగు ప్లాట్లు మంటల్లో కాలిపోయినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే.. ఫైర్ సిబ్బంది స్పాట్ కు చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. 

ఈ అగ్ని ప్రమాదంలో ఎన్ని ప్లాట్లు దెబ్బతిన్నాయి.. ప్రమాదానికి కారణం ఏంటీ అనేది తెలియాల్సి ఉంది.