Keerthy Suresh : మన సంస్కృతిని ఎప్పటికీ తక్కువ చేయను.. రాధికా ఆప్టే వివాదంపై కీర్తి సురేశ్ క్లారిటీ!

Keerthy Suresh : మన సంస్కృతిని ఎప్పటికీ తక్కువ చేయను.. రాధికా ఆప్టే వివాదంపై కీర్తి సురేశ్ క్లారిటీ!

సినీ ప్రమోషన్లలో సెలబ్రిటీలు చేసే చిన్న చిన్న వ్యాఖ్యలే ఒక్కోసారి పెద్ద వివాదాలకు దారితీస్తుంటాయి. లేటెస్ట్ గా హీరోయిన్ కీర్తి సురేశ్ విషయంలోనూ ఇదే జరిగింది. నటి రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలకు కీర్తి నవ్వడంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. అయితే ఇన్నాళ్లకు ఈ వ్యవహారంపై కీర్తి సురేశ్ స్పందిస్తూ అసలు విషయం ఏంటో క్లారిటీ ఇచ్చింది. దీంతో మరోసారి ఈ ఆంశం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

అసలు వివాదం ఏంటంటే?

రాధికా ఆప్టే ఇటీవల తన నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ 'అక్కా' ప్రమోషన్లలో భాగంగా ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. గతంలో తాను నటించిన ఓ సినిమాలో తన పాత్రకు సంబంధించిన కథాంశం గురించి మాట్లాడుతూ.. కథలో భాగంగా తన మేనమామను పెళ్లి చేసుకునే మహిళగా నటించాల్సి వచ్చిందని తెలిపారు. ఈ వ్యాఖ్యలను తెలుగు ప్రేక్షకుల్లో కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 

ఈ ఇంటర్వ్యూలో రాధికా ఆప్టే పక్కనే కీర్తి సురేశ్‌ కూడా ఉన్నారు. రాధికా ఆ విషయం చెబుతున్న సమయంలో కీర్తి నవ్వుతూ కనిపించారు. అంతేకాకుండా.. "ఇది తమిళ, తెలుగు ప్రాంతాల్లో ఉండే సంప్రదాయం. మేనమామను పెళ్లి చేసుకుంటారు" అనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. దీంతో కొందరు నెటిజన్లు కీర్తిపై కూడా విమర్శలు గుప్పించారు. మన సంస్కృతి గురించి మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.

కీర్తి క్లారిటీ..

ప్రస్తుతం తన కొత్త సినిమా 'సత్యవాన్ సావిత్రి' ప్రమోషన్లలో బిజీగా ఉన్న కీర్తి సురేశ్‌.. లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో ఈ వివాదంపై స్పందించారు. రాధికా ఆప్టే మొదట మాట్లాడినప్పుడు ఆమె ఉద్దేశం తనకు పూర్తిగా అర్థం కాలేదని చెప్పారు. ఆ తర్వాత ఆమె దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో, కొన్ని వర్గాల్లో అనుసరించే సంప్రదాయం గురించి మాట్లాడుతున్నారని అర్థమైందని వివరించారు. 

►ALSO READ | Netflix Thriller: నెట్‌ఫ్లిక్స్‌ ట్రెండింగ్లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్.. 3 రోజుల్లోనే 32 లక్షల వ్యూస్!

 మన సంస్కృతిని తాను ఎప్పటికీ తక్కువ చేసి మాట్లాడనని స్పష్టం చేశారు. ఈ సంప్రదాయం కేరళలో లేదని కూడా పేర్కొన్నారు. తన నవ్వును సంస్కృతిని అవమానించినట్లుగా భావించకూడదనేది కీర్తి వివరణ ఇచ్చారు. మరి కీర్తి వివరణతో ఈ వివాదానికి తెరపడుతుందా? లేక సోషల్ మీడియాలో చర్చ మరింత ముదురుతుందా? అనేది చూడాలి...