డ్రగ్స్ రహిత సమాజం కోసం అందరు కలిసి రావాలని పిలుపు నిచ్చారు సినీ నటుడు నాగార్జున. సమాజం, యువత జీవితాలను నాశనం చేస్తున్న డ్రగ్స్ రక్కసిని అంతమొందించడం మనందరి సామాజిక బాధ్యత అన్నారు. డ్రగ్ రహితసమాజ నిర్మాణం కోసం జరిగే నషా ముక్త్ భారత్ లాంటి కార్యక్రమాలకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు నాగార్జున.
నవంబర్ 25,26,26 తేదీల్లో హైదరాబాద్ లో నిర్వహించే అత్యంత ప్రతిష్టాత్మకమైన నషా ముక్త్ భారత్ యాత్రలో పాల్గొన్నారు సినీ నటుడు నాగార్జునను ఆహ్వానించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గురువారం నాగార్జున ఇంటికి వెళ్లిన కిషన్ రెడ్డి.. డ్రగ్ రహి సమాజం కోసం తలపెట్టిన ఈ మహా ప్రజా ఉద్యమంలో భాగస్వాములు కావాలని నాగార్జునను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి యాత్ర టీ-షర్టులను ఆవిష్కరించిన అక్కినేని నాగార్జున.
►ALSO READ | నిర్మల్ జిల్లాలో 99 రూపాయలకే కిలో చికెన్.. కూర కోసం ఎగబడ్డ జనం
ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన "నషా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్" పిలుపు మేరకు, 2029 నాటికి డ్రగ్స్ రహిత భారతాన్ని నిర్మించాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృఢ సంకల్పంతో ఈ యాత్రను చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. భావితరాల భద్రత కోసం నిర్వహిస్తున్న ఈ మహా యజ్ఞంలో యువత, తల్లిదండ్రులు, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
