ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ పాన్ ఇండియా చిత్రం 'డ్రాగన్'. ఇప్పటికే ఈ మూవీపై సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం ఈ మూవీ గురించి టాలీవుడ్ వర్గాల్లో ఓ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమాలో ఎన్టీఆర్ ను ఇప్పటివరకు చూడని విధంగా అత్యంత పవర్ ఫుల్, రఫ్ అండ్ రస్టిక్ లుక్ లో చూపించబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ ఈ మూవీపై అంచనాలను భారీగా పెంచాయి. ఈ చిత్రంలో ఎన్టీఆర్ లూగర్ అనే అస్సాసిన్ పాత్రలో కనిపించనున్నారు. 1960ల నాటి నేపథ్యం, ఆఫ్ఘనిస్తాన్ కు సంబంధించిన కథాంశం, డ్రగ్స్ మాఫియా వంటి అంశాలు సినిమాలో కీలకంగా ఉండనున్నట్లు సమాచారం..
అయితే ఈ కథను రెండు భాగాలుగా విభజించి, రెండు సినిమాల షూటింగ్‌ను ఒకేసారి పూర్తి చేయాలనేది ప్రశాంత్ నీల్ ఆలోచనగా ఉన్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అలా చేస్తే మొదటి భాగం విడుదలైన కొద్ది నెలల్లోనే రెండో భాగాన్ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చు. లేటెస్ట్ సమాచారం ప్రకారం 2027 జూన్ 11న 'డ్రాగన్' మొదటి భాగాన్ని, అదే ఏడాది డిసెంబర్ మొదటి వారంలో రెండో భాగాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఒకవేళ డిసెంబర్‌లో సాధ్యం కాకపోతే 2028 సమ్మర్‌కు వాయిదా వేసే అవకాశముంది. అయితే రెండు భాగాల విడుదల తేదీలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ALSO READ : ‘ఓం’ మూవీ రిలీజ్ వేళ.. ఫ్యాన్స్‌కు హీరో ధనుష్ కీలక విజ్ఞప్తి
ఇక ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, అనిల్ కపూర్, బిజూ మీనన్, ఆశుతోష్ రాణా, ఖుష్బూ సుందర్, గురు సోమసుందరం తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రవి బస్రూర్ సంగీతం, భువన్ గౌడ సినిమాటోగ్రఫీ ఈ ప్రాజెక్ట్‌కు మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు జూన్ 11, 2027 విడుదల తేదీని నిర్మాత రవిశంకర్ ఇప్పటికే ప్రకటించారు.. మరి రెండు భాగాలుగా 'డ్రాగన్' నిజంగానే బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తుందా? అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు...
