లైవ్‌లో తల్లిని కాబోతున్నట్లు ప్రకటించిన 59 ఏళ్ల టీవీ యాంకర్

లైవ్‌లో తల్లిని కాబోతున్నట్లు ప్రకటించిన 59 ఏళ్ల టీవీ యాంకర్

చిత్ర విచిత్రాలు.. నమ్మలేని కొన్ని నిజాలు అన్నీ విదేశాల్లోనే జరుగుతుంటాయి. అలాంటి వాటిలో ఫ్యామిలీ మేటర్స్, విడాకులు, మళ్లీ పెళ్లి.. పిల్లల విషయాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఇన్సిడెంట్ ఒక జరిగింది. బ్రిటన్ దేశానికి చెందిన జీబీ(GB News) న్యూస్ ఛానెల్ లో జరిగింది. 59 ఏళ్ల టీవీ ప్రజెంటర్ అయిన డాక్టర్ రెనీ హూండర్ క్యాంప్.. తాను ఈ వయస్సులో తల్లిని అవుతున్నట్లు ప్రకటించారు. అందులోనూ డిస్కషన్ జరుగుతున్న సమయంలో.. నలుగురు గెస్టులు ఉన్న ప్యానెల్ మధ్యలో ఈ ప్రకటన చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

బ్రిటిష్ టీవీ ప్రెజెంటర్, NHS నర్స్ ప్రాక్టీషనర్ అయిన యాంకర్ డాక్టర్ రెనీ రెనీ హూండర్ క్యాంప్.. రోజు మాదిరిగానే న్యూస్ డిస్కషన్ చేస్తున్నారు. నలుగురు గెస్టులు ఉన్నారు. డిస్కషన్ మధ్యలో.. నేను మూడో సారి తల్లిని కాబోతున్నాను.. నా కడుపులో చిన్నారి పెరుగుతుంది.. ఆ చిన్నారి వయస్సు 12 వారాలు అని ప్రకటించారు. 59 ఏళ్ల వయస్సులో తల్లిని కావటం ఏంటీ అనే విమర్శలు వస్తాయి.. వాటిని నేను ఏమీ బాధపడను అని గర్వంగా లైవ్ షోలోనే ప్రకటించారు రెనీ హూండర్ క్యాంప్.

అంతే కాదు.. ఇప్పటికే నాకు 37 ఏళ్ల కుమారుడు ఉన్నాడు.. ఎనిమిదేళ్ల మరో కూతురు ఉంది. మరో బిడ్డను కనాలని నిర్ణయించుకున్నప్పుడు.. సమాజం నుంచి వచ్చే విమర్శలను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలని అప్పుడే నిర్ణయించుకున్నానంటూ వెల్లడించారామె. నేను ఒక మహిళను మాత్రమే కాదు.. తల్లిని కూడా. పెద్ద కొడుకు ఉన్నాడు, చిన్న అమ్మాయి ఉంది. త్వరలో మూడో బిడ్డకు తల్లిని అవుతాను అని చెప్పుకొచ్చారు. ఆమె అలా సడెన్ గా ప్రకటించటంతో.. ప్యానెల్ లోని సభ్యులు మొదట షాక్ అయ్యారు.. మౌనంగా ఉన్నారు.. కొద్దిసేపు తర్వాత అందరూ అభినందనలు తెలిపారు. అమేజింగ్ న్యూస్ అంటూ ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు. అబ్బాయి పుడతాడని నమ్మకంతో ఉన్నానని.. డాక్టర్లు అమ్మాయి అని చెప్పినట్లు డిస్కషన్ లో వివరించారు టీవీ యాంకర్ రెనీ హూండర్ క్యాంప్.

ALSO READ : AI ఆంత్రోపిక్ IPO రికార్డ్

18 నెలల క్రితం మరో బిడ్డ కోసం ఆలోచించడం మొదలుపెట్టానని.. ముందుగానే భద్రపరిచిన అండాల ద్వారా బిడ్డను కనాలని అని నిర్ణయించుకున్నప్పుడు.. బ్రిటన్ దేశంలోని ఏ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ సహాయం చేయడానికి ముందుకు రాలేదని.. చివరకు పోలాండ్‌ దేశం వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకున్నానని.. మూడు సార్లు ప్రయత్నించిన తర్వాత గర్భవతి అని నిర్థారించినట్లు వివరించారామె. 50 ఏళ్ల వయస్సులో బిడ్డకు కన్నప్పుడు వచ్చిన విమర్శలను గుర్తు చేసుకున్నారామె.

లైవ్ టీవీ షో ఆమె చేసిన ప్రకటన తర్వాత ఎక్స్‌లో స్పందిస్తూ.. శుభాకాంక్షలు తెలిపిన వారికి కృతజ్ఞతలు... విమర్శించిన వారిపై స్పందిస్తూ.. మీరేమనుకుంటారో నాకు పట్టదు అంటూ ఘాటుగా రిప్లయ్ ఇచ్చారామె.