హైదరాబాద్‌లో పెరుగుతున్న అమ్ముడుపోని నివాసాల్లో లగ్జరీ ఇళ్లదే ప్రధాన పాత్ర అని నివేదిక తెలిపింది. పెరిగిన అమ్ముడుపోని స్టాక్‌లో దాదాపు 45- నుంచి 50 శాతం లగ్జరీ ప్రాజెక్ట్లవే ఉన్నాయి. ముఖ్యంగా వెస్ట్ హైదరాబాద్‌లోని కోకాపేట్, నియోపొలీస్, తెల్లాపూర్, ఖానామెట్, కొల్లూరులో భారీ ఎత్తున టవర్లను నిర్మాణ రంగ కంపెనీలు నిర్మిస్తున్నాయి. నగరంలోని మొత్తం లాంచ్‌లు, అమ్మకాల్లో దాదాపు 85- నుంచి 90 శాతం నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్ ప్రాంతాల్లోనే ఎక్కువ నిర్మాణాలు సాగుతున్నాయి.
ఈ ప్రాంతాల్లో ఐటీ కంపెనీలకు దగ్గరగా ఉండటం, మౌలిక వసతులు మెరుగుపడటంతో బిల్డర్లు ఈ ప్రాంతాలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అయితే, ఇటీవల కాలంలో బిల్డర్లు కాస్త అప్రమత్తమై లగ్జరీ నుంచి మిడ్-సెగ్మెంట్ (మధ్యతరగతి) ఇళ్ల వైపు మళ్లుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. టవర్స్‌లో ఫ్లాట్లు రూ.కోటి నుంచి రూ. 5 కోట్ల వరకు ధరలు పలుకుతున్నాయి.
హైదరాబాద్ లో అపార్ట్ మెంట్ ఫ్లాట్స్ ధరలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం 1500 ఎస్ ఎఫ్ టీ ఉన్న త్రిబుట్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఏ ఏరియాలో కొనాలన్నా రూ.కోటికి తక్కువ లేదు. మధ్యతరగతి ప్రజలు మాత్రం రూ. 50 లక్షల నుంచి రూ. 80 లక్షల వరకు కొనుగోలు చేసేందుకే ఆసక్తి చూపుతున్నారు. భారీగా ధరలు ఉండటం, లోన్లు తీసుకుంటే 30 ఏళ్ల పాటు ఈఎంఐలు, వడ్డీలు కట్టడం భారంగా భావిస్తున్నారు.
►ALSO READ | గ్రోలో వాటాలు కొన్న పెద్ద ఇన్వెస్టర్లు ..రూ.1,905 కోట్ల విలువైన డీల్స్
మరో వైపు గతంలో ఉన్నట్లుగా లిక్విడ్ క్యాష్ లేకపోవటంతో వెనుకడుగు వేస్తున్నారు. ఒక వేళ ఉన్నా రూ. కోటి పెట్టి కొనటానికి ఆసక్తి చూపటం లేదు. ప్లాట్ కంటే భూమి కొనుగోలు చేయటం బెటర్ అని భావిస్తున్నారు. ప్రాపర్టీ షోలకు వచ్చే పబ్లిక్ సైతం రూ. 1 కోటి లోపు ఉండే ప్లాట్ల గురించే ఎక్కువ వివరాలు అడుగుతున్నారని బిల్డర్లు చెబుతున్నారు.
