గ్రోలో వాటాలు కొన్న పెద్ద ఇన్వెస్టర్లు ..రూ.1,905 కోట్ల విలువైన డీల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

గ్రోలో వాటాలు కొన్న పెద్ద ఇన్వెస్టర్లు ..రూ.1,905 కోట్ల విలువైన డీల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ:ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ బ్రోకరేజ్ సంస్థ గ్రో పేరెంటో కంపెనీ  బిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దేశ, విదేశీ  సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 1,905 కోట్ల విలువైన వాటాలను కొనుగోలు చేశారు. మంగళవారం జరిగిన బ్లాక్ డీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా ఒక్కో షేరును సగటున రూ. 219 చొప్పున మొత్తం 8.70 కోట్ల షేర్లను (1.38శాతం వాటా) కొన్నారు. ఇందులో కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్ అత్యధికంగా రూ. 448.95 కోట్లతో 2.05 కోట్ల షేర్లను దక్కించుకుని తన వాటాను 2.21 శాతానికి పెంచుకుంది. ప్రపంచ అతిపెద్ద అసెట్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ సంస్థ బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాక్  రూ. 294.55 కోట్లతో 1.34 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. టాటా ఎంఎఫ్‌, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎస్ ట్రస్ట్, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు మోర్గాన్ స్టాన్లీ, యూబీఎస్, ఫిడిలిటీ కూడా షేర్లను కొన్నాయి.