పూజా రెడ్డి ప్రధాన పాత్రలో మహేశ్ కాంపెల్లి తెరకెక్కించిన చిత్రం ‘వ్యూ’. ది పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ట్యాగ్ లైన్. ప్రదీప్, సోనియా ఇతర కీలక పాత్రల్లో నటించారు. మాస్టర్ కార్తికేయ సమర్పణలో సత్య చౌదరి నిర్మించారు. ఈ నెల 20న శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా బాపిరాజు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. డైరెక్టర్ మహేశ్ కాంపెల్లి మాట్లాడుతూ ‘ప్రతి ఒక్కరికీ ఒక వ్యూ ఉంటుంది. ఈ కథ నా వ్యూ పాయింట్‌లో నుంచి చెప్పింది.
సహజత్వానికి దగ్గరగా మన ఇంట్లో, పొరుగింట్లో జరిగినట్టు ఉంటుంది. ఒక మంచి సినిమా చేశానని మాత్రం గర్వంగా చెప్పగలను’ అని చెప్పాడు. చక్కని కంటెంట్ ఉన్న సినిమా కాబట్టే ‘వ్యూ’ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామని డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు చెప్పారు. ఒక మంచి ఫీమేల్ ఒరియెంటెడ్ సినిమా తీశామని, అందరికీ నచ్చుతుందని నిర్మాత సత్య చౌదరి చెప్పారు. పూజారెడ్డి, సోనియా, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
