- సెక్రటేరియెట్‌లో పెండింగ్ పడుతున్న ఏసీబీ కేసులను సమీక్షించేలాసీఎస్ను ఆదేశించండి
- గవర్నర్‌కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ
హైదరాబాద్, వెలుగు: ఏసీబీ కేసుల్లో పట్టుబడిన ప్రభుత్వ ఉద్యోగులపై కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకోవడం, ప్రాసిక్యూషన్‌కు అనుమతులు ఇవ్వడంలో ఏళ్ల తరబడి జాప్యం చేయడంపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై సమగ్ర సమీక్ష చేపట్టేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలని కోరుతూ ఫోరం అధ్యక్షుడు పద్మనాభరెడ్డి బుధవారం రాష్ట్ర గవర్నర్‌కు లేఖ రాశారు.
ఇందులో పేర్కొన్న అంశాల మేరకు.. ‘ఏసీబీ ప్రతి నెలా సగటున 15 కేసులు నమోదు చేస్తోంది. వీటిలో ట్రాప్, ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల నమోదు కంటే ముందు విస్తృతంగా విచారణ చేపడుతోంది. దర్యాప్తు పూర్తయిన తర్వాత నిందితులపై ప్రాసిక్యూషన్‌కు అనుమతి కోరుతూ ఏసీబీ డీజీ ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నారు’.
మూడేళ్ల వరకు ఫైళ్లకు మోక్షం లేదు !
ఏసీబీ డీజీ పంపిన నివేదికలు విజిలెన్స్ కమిషన్ పరిశీలన అనంతరం ప్రభుత్వానికి చేరుతున్నాయి. సచివాలయంలోని సంబంధిత శాఖల్లో ఫైళ్లు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయని పద్మనాభరెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో మూడు నుంచి నాలుగేళ్ల వరకు అనుమతులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపించారు.
ఏసీబీ, విజిలెన్స్ కమిషన్ సిఫార్సులతో ప్రభుత్వం విభేదించి కేసులను శాఖాపరమైన విచారణకు మళ్లించడం, చివరకు క్రిమినల్ కేసులను ఉపసంహరించుకునేలా ఆదేశాలు ఇవ్వడం ఆందోళనకరమని తెలిపారు. రూ.8 వేల లంచం తీసుకుంటూ 2023 ఏప్రిల్‌లో ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన ఓ ఎస్ఐ ఉదంతం ఇందుకు ఉదాహరణగా వివరించారు.
