చేయూత పత్రం చేతికొచ్చింది: ఎమ్మెల్యే నాయిని

చేయూత పత్రం చేతికొచ్చింది: ఎమ్మెల్యే నాయిని

తెలంగాణ ప్రభుత్వం చేయూత నూతన ఫించన్ మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేస్తుంది. అందుటో భాగంగా బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో వరంగల్​ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్​రెడ్డి ఎంపీ కడియం కావ్య, కుడా చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్ గుండు సుధారాణి, కలెక్టర్ చాహత్ బాజ్‌‌‌‌‌‌‌‌పాయ్ తో కలిసి 2,698 మంది లబ్ధిదారులకు కొత్త పింఛన్​ మంజూరు పత్రాలు అందజేశారు. దీంతో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న పింఛన్లు రాబోతున్నాయని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్‌‌‌‌‌‌‌‌లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘ఇందిరమ్మ టవర్స్‌‌‌‌‌‌‌‌’ నిర్మాణానికి చర్యలు చేపడుతోందని తెలిపారు. నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులకు విడతల వారీగా ఇళ్లు కేటాయిస్తామని చెప్పారు. గత బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం పదేళ్ల పాలనలో కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇళ్ల పంపిణీని పట్టించుకోలేదని విమర్శించారు.

వరంగల్, వెలుగు​