వన్ మోర్ ఛాన్స్.. వన్ మోర్ డ్యాన్స్.. కేతిక శర్మతో టైగర్ ష్రాఫ్ సందడి

వన్ మోర్ ఛాన్స్.. వన్ మోర్ డ్యాన్స్.. కేతిక శర్మతో టైగర్ ష్రాఫ్ సందడి

తొలిచిత్రం ‘రొమాంటిక్‌‌’తో హీరోయిన్‌‌గా ఆకట్టుకుని వరుస అవకాశాలు అందుకుంది కేతిక శర్మ. అయితే అవకాశాలు వచ్చిన స్థాయిలో విజయాలు దక్కలేదు.  కెరీర్‌‌‌‌ ప్రారంభించి ఐదేళ్లు పూర్తి చేసుకున్న ఈ బ్యూటీ సరైన సక్సెస్‌‌ కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో ఓ మ్యూజిక్ వీడియోలో మెరిసింది.  టైగర్‌‌‌‌ ష్రాఫ్‌‌కు జంటగా కేతిక నటించిన 'తేను లేకే జానా'  అనే రొమాంటిక్ మ్యూజిక్ వీడియో ప్రోమోను ఇటీవల విడుదల చేశారు.

ఇటీవల జరిగిన కాల్పుల ఘటన తర్వాత టైగర్‌‌‌‌ ష్రాఫ్‌‌.. సోషల్ మీడియాలోకి రీఎంట్రీ ఇస్తూ ఈ సాంగ్‌‌ ప్రోమోను షేర్ చేశాడు. ‘వన్‌‌ మోర్ ఛాన్స్‌‌.. వన్ మోర్ డాన్స్‌‌’ అనే క్యాప్షన్‌‌తో టైగర్‌‌‌‌ షేర్ చేసిన ఈ వీడియో వైరల్‌‌ అవుతోంది.  ఇందులో తనకు జంటగా కేతిక శర్మ కనిపించింది.  టైగర్‌‌‌‌ ష్రాఫ్‌‌ డాన్స్‌‌ మూమెంట్స్‌‌తో, కేతిక శర్మ గ్లామర్‌‌‌‌తో పాటు ఇద్దరి ఆన్‌‌ స్క్రీన్‌‌ కెమిస్ట్రీ ఇంప్రెస్ చేసిందంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మరి ఈ రొమాంటిక్ సాంగ్‌‌ తర్వాతైనా కేతికకు కొత్త అవకాశాలు పలకరిస్తాయేమో చూడాలి!