హైదరాబాద్: హైదరాబాద్ సిటీలోని పంజాగుట్టలో నవజాత శిశువు మృతదేహం కలకలం రేపింది. ప్రధాన రహదారి ఫుట్‌పాత్‌పై ప్లాస్టిక్ కవర్‌లో శిశువు మృతదేహం గుర్తించారు. నెలలు నిండని పిండాన్ని ప్లాస్టిక్ కవర్‌లో వదిలేశారు. నిత్యం జనసంచారం ఉండే ప్రాంతంలో మృతదేహం లభ్యమవడంతో వాహనదారులు ఉలిక్కిపడ్డారు.
రద్దీగా ఉండే ప్రాంతంలో నవ జాత శిశువును ఎవరు తీసుకొచ్చి పడేశారనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్‌తో ఘటనా స్థలంలో ఆధారాల సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
►ALSO READ | బంగ్లాదేశ్ లో మళ్లీ అల్లర్లు..మహ్మద్ యూనిస్ ఇంటికి.. నిప్పు పెట్టిన ఆందోళనకారులు
