PM Modi GTA 6 Post: గేమింగ్ ప్రపంచం మొత్తం GTA 6 ఫీవర్‌తో ఊగిపోతుండగా, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) కూడా ఈ గేమింగ్ క్రేజ్‌ను తనదైన శైలిలో అందిపుచ్చుకున్నారు. 2013లో GTA 5 విడుదలైనప్పటి నుంచి 2026లో GTA 6 వచ్చే వరకు ఉన్న 13 ఏళ్ల సుదీర్ఘ విరామాన్ని, తన ప్రభుత్వ హయాంలో భారతదేశం సాధించిన అద్భుత ప్రగతికి ఒక కొలమానంగా చూపిస్తూ ప్రధాని మోడీ ఎక్స్ (X) వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. భారత్ ఇప్పుడు సరికొత్త గేమ్ ఆడుతోంది! (India is playing a whole new game!) అంటూ ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
13 ఏళ్లలో మారిన భారత్ రూపురేఖలు.. మోడీ క్రేజీ పోస్ట్:
* గేమర్లు వైస్ సిటీకి తిరిగి వెళ్లడానికి 13 ఏళ్లు వేచి చూసిన ఈ కాలంలో, 2014లో అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వం భారతదేశాన్ని అన్ని రంగాల్లో ఎలా అగ్రగామిగా నిలిపిందో ప్రధాని మోడీ వివరించారు.
* ఆర్థిక శక్తిగా ఎదుగుదల: ఒకప్పుడు ఫ్రాజైల్ ఫైవ్ (Fragile Five - బలహీన ఆర్థిక వ్యవస్థలు) జాబితాలో ఉన్న ఇండియా, నేడు ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఎదిగింది.
* డిజిటల్ విప్లవం: యూపీఐ (UPI) ద్వారా డిజిటల్ చెల్లింపుల విస్తరణ, ఆర్థిక సమ్మిళితత్వం (Financial Inclusion), ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
పేదరిక నిర్మూలన: కోట్లాది మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడంతో పాటు విజయవంతమైన పారిశుద్ధ్య మిషన్ (స్వచ్ఛ భారత్) ద్వారా దేశ రూపురేఖలు పూర్తిగా మారాయి.
* అంతరిక్ష విజయాలు, నక్సల్ రహిత భారత్: అంతరిక్ష పరిశోధనల్లో (ISRO) చారిత్రాత్మక విజయాలు సాధించడంతో పాటు సాంకేతిక సామర్థ్యాలు పెరిగాయని, దేశం నక్సల్ రహిత భారత్ దిశగా అడుగులు వేసిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
►ALSO READ | తొమ్మిదేళ్లలో పెద్ద మతంగా ఇస్లాం.. 2వ స్థానంలో క్రైస్తవం: హిందూ మతం పరిస్థితి ఏంటంటే..?
రికార్డుల సునామీ సృష్టిస్తున్న GTA 6:
* రాక్‌స్టార్ గేమ్స్ రూపొందించిన GTA 6, నవంబర్ 19 అర్ధరాత్రి విడుదలై ఎంటర్‌టైన్‌మెంట్ చరిత్రలోనే అతిపెద్ద లాంచ్‌గా నిలిచింది.
* ప్రీ-ఆర్డర్లలో రికార్డు: సెన్సార్ టవర్ (Sensor Tower) నివేదిక ప్రకారం, విడుదల కాకముందే ఈ గేమ్ ప్రీ-ఆర్డర్ల ద్వారా 1.5 బిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది.
* నిద్ర మానేసి ఆడుతున్న ఫ్యాన్స్: అర్ధరాత్రి గేమ్ అన్‌లాక్ అయినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది గేమర్లు నిద్ర మానేసి, ఆఫీసులకు సిక్ లీవ్స్ పెట్టి మరీ వైస్ సిటీలో లూసియా, జేసన్ సాహసాలను ఆస్వాదిస్తున్నారు. మెటాక్రిటిక్ (Metacritic) లోనూ ఈ గేమ్‌కు దాదాపు పర్ఫెక్ట్ స్కోర్ రావడం విశేషం.
India is playing a whole new game! https://t.co/CMkMbK6vII
— Narendra Modi (@narendramodi) November 19, 2026
