హైదరాబాద్: టోలిచౌకి సీఐ రమేష్ నాయక్ కేసులో ఏసీబీ లోతుగా దర్యాప్తు చేస్తుంది. లంచం తీసుకుంటూ పట్టుబడిన సీఐపై ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలు కూడా ఉండటంతో ఈ కోణంలో కూడా ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. షేక్ పేట, యాదాద్రి భువనగిరి, మిర్యాలగూడ శివారు ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అనుమానం వ్యక్తం చేసింది. షేక్ పేటలోని కోటి విలువ చేసే ఇంటిని CI సోదరుడు కుమారుడి పేరున రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఏసీబీ గుర్తించినట్లు సమాచారం. టోలిచౌకి పీఎస్ పరిధిలోని బిల్డర్ల నుంచి ముడుపులు ముట్టాయనే ఆరోపణలపై ఏసీబీ ఆరా తీసింది.
హైదరాబాద్‌లోని టోలిచౌకి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ టి. రమేష్ నాయక్ బుధవారం రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఒక ఫిర్యాదుదారుడి నుంచి ఆయన ఈ నగదును డిమాండ్ చేసి తీసుకుంటుండగా.. అధికారులు పట్టుకున్నారు. ఫిర్యాదుదారుడి సమాచారంతో కేసు నమోదు చేసిన ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ నేతృత్వంలోని బృందం రమేష్ నాయక్‌ను పట్టుకుంది. సీఐ దగ్గర రూ. 20 వేల నగదు, లెక్కల్లో చూపని రూ. 50వేలు కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి, టోలిచౌకి పోలీస్ స్టేషన్‌లో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.
►ALSO READ | పంజాగుట్టలో మెయిన్ రోడ్పై పసికందు మృతదేహం
