భాక్రానంగల్ కాల్వపై కూలిన ఇనుప బ్రిడ్జి.. రెండు ట్రక్కులకు మంటలు

భాక్రానంగల్ కాల్వపై కూలిన ఇనుప బ్రిడ్జి.. రెండు ట్రక్కులకు మంటలు

పంజాబ్ లోని భాక్రానంగల్ కాలువపై ఘోర ప్రమాదం జరిగింది. కాలువపై నిర్మించిన  ఇనుప వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. వంతెనపై ప్రయాణిస్తున్న రెండు ట్రక్కులు ఇనుప కడ్డీలపై మధ్యలో చిక్కుకున్నాయి.  ప్రమాద సమయంలో మంటలు చెలరేగి  రెండు ట్రక్కులకు అంటుకున్నాయి. దీంతో ట్రక్కులు రెండు పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలార్పేశారు. ఇద్దరు ట్రక్కు డ్రైవర్లను రక్షించారు.  పాటియాలా - సంగ్రూర్  బైపాస్ వంతెనపై గురువారం(నవంబర్19) ఉదయం ఈ ప్రమాదం జరిగింది. 

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, గురువారం ఉదయం 5 గంటల ప్రాంతంలో వాహనాలు దాటుతుండగా వంతెన అకస్మాత్తుగా కుప్పకూలింది. కూలిపోయిన తర్వాత రెండు ట్రక్కులు కాలువలోకి దూసుకెళ్లగా, వాహనాల్లో ఒకటి మంటల్లో చిక్కుకుంది. వెంటనే, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.  వంతెన కూలిపోవడానికి గల కారణం ఇంకా నిర్దారణ కాలేదు. నష్టం ఎంత జరిగింది. గాయపడిన వారి పరిస్థితి ఏంటీ  వంటి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

►ALSO READ | మీ అమ్మ చనిపోయింది.. ఎక్కడున్నా వెంటనే రండి : పిల్లల కోసం పేపర్లలో ప్రకటన