జుట్టుకు కలర్ వేస్తున్నారా ? జాగ్రత్త.. లేదంటే ఈ సమస్యలను కొని తెచ్చుకుంటున్నట్టే!

 జుట్టుకు కలర్ వేస్తున్నారా ? జాగ్రత్త.. లేదంటే ఈ సమస్యలను కొని తెచ్చుకుంటున్నట్టే!

ట్రెండీ లుక్ కోసమో... జుట్టు  తెల్లగామారిందనో చాలామంది హెయిర్ కలర్స్ వేస్తుంటారు. రకరకాల హెయిర్ డైలు వాడుతుంటారు. అయితే ఇలా హెయిర్ డైలు వాడినా తరచూ రంగులు మార్చినా భవిష్యత్తులో జుట్టు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకని హెయిర్ కలర్ వేసుకోవాలనుకునే ముందు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వాటి నుంచి బయటపడొచ్చు.

*జుట్టుకు వాడే రంగుల్లో రకరకాల కెమికల్స్ కలిపే ఛాన్స్ ఉంది. దాని వల్ల చాల  స్కిన్, హెయిర్ ప్రాబ్లమ్స్ వస్తాయి.
*జుట్టుకు రకరకాల రంగులు మారుస్తూ వేయడం వల్ల జుట్టు చివర్లు చిట్లిపోయి, బలహీనమవుతాయి
*హెయిర్ కలర్స్ రెగ్యులర్ గా వేయడం వల్ల ఆస్తమా వంటి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది.

ఏం చేయాలి?
*హెయిర్ కలర్స్ సెలెక్ట్ చేసుకునే ముందు కెమికల్స్ లేని నేచురల్ ప్రొడక్ట్స్ నే సెలెక్ట్ చేయాలి.
*తరచూ హెయిర్ కలర్ వేసుకోవడం వల్ల వెంట్రుకలు, కుదుళ్లు బలహీనంగా మారే ఛాన్స్ ఉంది. కాబట్టి పదిహేను రోజులు గ్యాప్ ఇచ్చి కలర్ వేసుకోవాలి. నేచురల్ కలర్స్ వాడితే నెల నుండి రెండు మూడు నెలల వరకూ జుట్టు నల్లగానే ఉంటుంది. కాబట్టి వాటినే ఎంచుకోవాలి.
*గోరింటాకు, కలబంద, ఉసిరి, మందార ఆకులు, పువ్వులు వంటి సహజంగా దొరికే వాటితోనూ కలర్ తయారు చేసుకోవచ్చు. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.
*రంగు వేయడమనేది తాత్కాలికమే కానీ పర్మినెంట్ పరిష్కారం కాదు. అందువల్ల ఎంత తక్కువగా రంగు వాడితే అంతమంచిది. అయితే ఒకవేళ తప్పని సరి రంగు వేయాలనుకుంటే రంగు వేసేముందు చేతి మీద అప్లై చేసుకుని టెస్ట్ చేసుకోవాలి. ఆ రంగు చర్మంపై ఎలాంటి చెడు ప్రభావం చూపకపోతేనే తలకు అప్లై చేయాలి.
*హెయిర్ కు ఏ కలర్ వేసుకున్నా కళ్లలో పడకుండా జాగ్రత్తపడాలి. వీటిలో ఉండే కెమికల్స్ వల్ల కళ్లకు ఇన్ఫెక్షన్, కంటి చూపు సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.