జ్యోతిష్యం: సంపదను సృష్టించే శుక్ర గ్రహం ఎఫెక్ట్.. మూడు రాశుల వారి ఇళ్లలో లక్ష్మీదేవి తాండవం..!

జ్యోతిష్యం:  సంపదను సృష్టించే శుక్ర గ్రహం ఎఫెక్ట్.. మూడు రాశుల వారి ఇళ్లలో లక్ష్మీదేవి తాండవం..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు  రాక్షసుల గురువు . సౌందర్యం, విలాసం, ప్రేమ, సంపద, శ్రేయస్సుకు కారకుడైన శుక్రుడు నవంబర్​ 22 వ తేది సాయంత్రం 5:10 గంటలకు ఆయన   తులారాశిలోకి ప్రవేశించానున్నాడు.  అక్కడే 2027 జనవరి 1 రాత్రి 11:18 గంటల వరకు సంచరిస్తాడు.  తులారాశి శుక్రుడి స్వంత రాశి కాబట్టి.. ఈ సంచారం ప్రత్యేకమైనది.  దీని ప్రభావం అన్ని రాశులపై ఉన్న ముఖ్యంగా మూడు రాశుల వారికి  మంచి ఆర్థిక లాభాలు చేకూరుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం. . .!  

కర్కాటక రాశి : ఈ రాశికి 4 వ ఇంటిలో శుక్రుని సంచారం నవంబర్​ 22 నుంచి జనవరి 1 వ తేది వరకు తులారాశిలో సంచారం చేస్తాడని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  ఈ రాశి వారికి ఎంతో మేలు జరుగుతుంది.ఉద్యోగంలో ప్రమోషన్ లేదా అధికార యోగం  ఉంటుందని పండితులు అంటున్నారు. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. సోదరులతో ఆస్తి వివాదాలు  పరిష్కారం అవుతాయి. వృత్తి పరంగా లైఫ్​ లో సక్సెస్​ సాధిస్తారు. అనుకోకుండా పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్​ తో పాటు జీతం పెరిగే అవకాశం ఉంది.  ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూసే వారు గుడ్​ న్యూస్​ వింటారు.ఇల్లు, భూములకు సంబంధించిన వివాదాలు, కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది.

సింహ రాశి: ఈ రాశి వారికి శుక్రుడు 3 వ ఇంట్లో (నవంబర్​ 22) సంచారం ప్రారంభించనున్నాడు.  ఈ ప్రభావం వలన ఈ రాశి వారికి అన్ని విధాలా ప్రయోజనం చేకూరుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.   ఆత్మవిశ్వాసం పెరగడంతో కష్టమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులు ప్రతిభను గుర్తించే టైం ఆస్నమైంది.వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులకు అనుకూలమైన సమయమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  కెరీర్‌లో పెద్ద టార్గెట్ సాధన లేదా మంచి వార్తలు వచ్చే అవకాశం ఉంది.. ఉద్యోగంలో హోదా పెరగడానికి, వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. కుటుంబంలో సమస్యలు, ఒత్తిళ్లు బాగా తగ్గి సుఖ సంతోషాలు పెరుగుతాయి. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది. బంధువర్గంలో మంచిపెళ్లి సంబంధం కుదురుతుంది.

వృశ్చిక రాశి:  ఈ రాశి 12వ ఇంటిలో శుక్రుడు ( నవంబర్​ 22) ప్రవేశించనున్నాడు.  దీని ప్రభావం వలన ఈ రాశి వారు విలాసవంతమైన జీవితం గడిపే అవకాశం ఉంది.గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు క్రమంగా పరిష్కారమవుతాయి. పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలకు ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, కొత్త అవకాశాలు  లభించవచ్చు. కొందరికి పదోన్నతి లేదా వేతన పెంపు కూడా దక్కవచ్చు. కొత్త ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. ముఖ్యమైన ఒప్పందాలు, కాంట్రాక్టులు లాభదాయకంగా మారవచ్చు . సంతానం, ఆరోగ్యం గురించి ఆందోళన చెందే వారి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.  వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. కొత్త ప్రేమలు పుట్టుకువస్తాయని పండితులు చెబుతున్నారు


Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం