సెలబ్రిటీల్లాగా అందమైన చర్మం కోసం ఫేషియల్ చేయించుకుంటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

సెలబ్రిటీల్లాగా అందమైన చర్మం కోసం ఫేషియల్ చేయించుకుంటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

స్లష్ ఫేషియల్. చర్మాన్ని ఆరోగ్యంగా.. అందంగా తీర్చిదిద్దుకునేందుకు సెలబ్రిటీలు ఎక్కువగా చేయించుకుంటున్న స్కిన్ ట్రీట్ మెంట్. అయితే ఈ ఫేషియల్ తో ఎంత ఉపయోగం ఉందో అంతే నష్టం కూడా ఉంది. ఈ ఫేషియల్ చేయించుకునే ముందు కచ్చితంగా దాని గురించి తెలుసుకోవాలి. అన్ని రకాల చర్మాలకు సెట్ అవుతుందో లేదో చూసుకోవాలి. ఆ తర్వాతే ప్రోసీడ్ కావాలి.

స్లష్ ఫేషియల్ అంటే...
ఎసిటోన్, డ్రై ఐస్ తో చేసే ఫేషియలే స్లష్ ఫేషియల్ ఎసిటోన్లో డ్రై ఐస్ వేసి ఉంచుతారు. దాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని ఫేస్ కు అప్లై చేస్తారు. మధ్య మధ్యలో డ్రై ఐస్ తో చుట్టిన క్లాత్తో ఫేస్ పై నెమ్మదిగా మసాజ్ చేస్తారు. ఇలా అరగంట పాటు మసాజ్ చేస్తారు. మొటిమలు, డెడ్ స్కిన్ సమస్యలతో బాధపడేవారే ఎక్కువగా ఈ ఫేషియలు చేయించుకుంటున్నారు.

ఉపయోగాలేంటి?
ఎసిటోన్, డ్రై ఐస్ కాంబినేషన్ తో ఫేషియల్ చేయించుకోవడం వల్ల డెడ్ స్కిన్, మురికి పూర్తిగా తొలగిపోతుంది. దాంతోపాటు బ్యాక్టీరియా, మొటిమలు వంటి వాటి వల్ల వచ్చే మచ్చలు, మంటను కూడా తగ్గిస్తుంది. మొటిమలు, మొటిమల వల్ల వచ్చే మచ్చలకు డ్రై ఐస్ ఉపయోగించడం కొత్తేమీ కాదు. కానీ ఎసిటోన్తో కలిపి డ్రై ఐస్ ఉపయోగించడం వల్ల ఆ మచ్చలు చర్మం లోపల నుంచి పూర్తిగా తొలగిపోతాయి. డ్రై ఐస్ లో యాంటీ బ్యాక్టీరియల్ క్వాలిటీస్ చర్మాన్ని క్రిముల నుంచి కాపాడుతాయి. దీంతో స్కిన్ కండిషన్ కూడా ఆరోగ్యంగా, మృదువుగా తయారవుతుంది. సాధారణంగా మండే గుణమున్న ఎసిటోనన్ను నెయిల్ పాలిష్ రిమూవ్ చేయడానికి ఉపయోగిస్తారు. అయితే ఇక్కడ దీన్ని డ్రై ఐస్తోతో మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మంపై ఉండే జిడ్డు వదులుతుంది.

ఈ ఫేషియల్ సేఫేనా?
ఆయిలీ స్కిన్ వాళ్లకు స్లష్ ఫేషియల్ చాలా ఉపయోగపడుతుంది. కానీ సెన్సిటివ్ స్కిన్, డ్రై స్కిన్ వాళ్లకు సెట్ కాదు. ఎసిటోన్ అనేదే బాగా డ్రైగా ఉంటుంది. అలాంటప్పుడు డ్రై స్కిన్ వాళ్లు ఈ ఫేషియల్ చేయించుకోవడం వల్ల వాళ్ల స్కిన్ ఇంకా డ్రైగా మారుతుంది. ఆయిల్ స్కిన్ వాళ్లు ఈ ఫేషియల్ చేయించుకోవాలనుకున్నా ఎక్స్పోరియన్స్ డెర్మడాలజిస్ట్లు లేదా బ్యూటీషియన్లతో చేయించుకోవాలి. దానికంటే ముందు స్కిన్ కండిషన్ ఎలా ఉందో, దాని ప్రొసీజర్ ఏంటో డెర్మటాలజిస్ట్ను అడిగి తెలుసుకోవాలి. ఈ ఫేషియల్ ఎట్టిపరిస్థితుల్లోనూ ఇంట్లో ట్రై చేయొద్దు.