జ్యోతిష్యం: అప్పులబాధలు వేధిస్తున్నాయా... శనివారం ( నవంబర్21) ఈ పూజలు చేయండి.. ఇట్టే తీరిపోతాయి..!

జ్యోతిష్యం: అప్పులబాధలు వేధిస్తున్నాయా... శనివారం ( నవంబర్21) ఈ పూజలు చేయండి.. ఇట్టే తీరిపోతాయి..!

కార్తీకమాసం చాలా విశిష్టమైనది పవిత్రమైనది.  జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెలరోజులు ఎంతో శక్తి కలిగి ఉంటాయి.  అందుకే దీపారాధనలు.. పూజలు.. నదీస్నానాలు.. దేవాలయ దర్శనాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు.అయితే శనివారం రోజున కొన్ని ప్రత్యేక నియమాలు పాటిస్తే అప్పుల బాధల నుంచి విముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.  ఆరోజు ఏం చేయాలి.. ఏదేవుడిని ప్రార్థించాలి.. మొదలగు విషయాలనే ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!

కార్తీక మాసంలో  శనివారానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ రోజున శివుడు, సుబ్రమణ్య స్వామి, హనుమంతుడిని పూజించడం వల్ల రుణబాధలు, దోషాలు తొలగి సుఖసంతోషాలు కలుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఆధ్యాత్మిక వేత్తలు తెలిపిన వివరాల ప్రకారం  కార్తీక మాసం అన్ని మాసాలకంటే చాలా పవిత్రమైనది. ఈ నెలో  పరమశివుడికి.. విష్ణుమూర్తికి పూజలు చేస్తారు. సూర్యోదయానికి ముందే కాలకృత్యాలు తీర్చుకొని దీపారాధనలు చేసి.. దేవాలయాను సందర్శిస్తారు.  కార్తీక మాసంలో చేసే పూజలు, వ్రతాలు, దీపారాధనలు, దానధర్మాలకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. 

కార్తీకమాసంలో  ప్రతి శని వారం చాలా ప్రత్యేకమైనది   ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు.  హనుమంతుడికి, శనిదేవుడికి  ప్రీతికరమైన రోజు. అందుకే కార్తీక శని వారాల్లో వీరిని భక్తిశ్రద్ధలతో పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ రోజున కొన్ని ప్రత్యేక పూజలు చేయడం వల్ల రుణబాధలు, గ్రహదోషాలు తొలగి, కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయని భక్తుల విశ్వాసం.

కార్తీక శనివారం విశిష్టత

శనిభగవానుడి  ఆరాధన: కార్తీక మాసంలో శని వారం రోజున శని దేవుడిని  పూజించడం ఎంతో విశేషంగా భావిస్తారు. ముఖ్యంగా శని వారం రోజున నువ్వుల నూనెతో అభిషేకం  అభిషేకం చేసి.. నల్ల నువ్వులు  అర్చించడం వల్ల రుణబాధల నుంచి ఉపశమనం లభిస్తుందని భక్తుల పండితులు చెబుతున్నారు.ఉద్యోగ విషయాల్లో  ఎదురవుతున్న ఆటంకాలు తొలగాలని ప్రార్థిస్తూ పూజ చేయాలి.  ఆ తరువాత నువ్వులు.. బెల్లం స్వామివారికి సమర్పించాలి. 

శివారాధన: కార్తీక మాసం శివుడికి అత్యంత ప్రీతికరమైనది కావడంతో శనివారం రోజున శివాలయాన్ని దర్శించుకోవడం శుభప్రదంగా భావిస్తారు. శివలింగానికి అభిషేకం చేసి, బిల్వదళాలు సమర్పించి, ఆవునెయ్యితో దేవాలయప్రాంగణంలో దీపారాధన చేయాలి. ముఖ్యంగా సాయంత్రం వేళ శివాలయంలో దీపం వెలిగించడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ రోజంతా ఉపవాసం ఉంటే చాలా మంచిది. 

  విష్ణుమూర్తి ఆరాధన: కార్తీక మాసంలో శివుడితో పాటు విష్ణుమూర్తిని కూడా ఆరాధిస్తారు. ఈ రోజున విష్ణు సహస్రనామాలను పఠించడం లేదా వినడం, శ్రీమహావిష్ణువుకు తులసీ దళాలతో పూజ చేయడం మంచిదని చెబుతారు. ఇలా చేయడం వల్ల  ఐశ్వర్యం వృద్ది చెంది.. రుణ బాధల నుంచి విముక్తి కలుగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

 హనుమంతుడి పూజ: శనివారం హనుమంతుడికి అత్యంత ఇష్టమైన రోజు. అందువల్ల కార్తీక శనివారాల్లో హనుమాన్ ఆలయాన్ని సందర్శించి స్వామివారికి తమలపాకులతో పూజ చేయడం, సింధూరం సమర్పించడం విశేషమని పండితులు చెబుతున్నారు. . హనుమాన్ చాలీసా, ఆంజనేయ దండకం చదవడం వల్ల భయాలు తొలగి ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరిగి అప్పుల బాధల నుంచి విముక్తి కలుగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

  కార్తీక పురాణ పఠనం: కార్తీక మాసంలో ప్రతిరోజూ కార్తీక పురాణాన్ని చదవడం లేదా వినడం ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా శని వారం రోజున భక్తిశ్రద్ధలతో పురాణ పఠనం చేయడం వల్ల పాపాలు తొలగి, ఐశ్వర్యం, మనశ్శాంతి కలుగుతాయి.

కార్తీక శనివారం పూజా విధానం

  •  ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి.
  •  ఇంట్లోని పూజా మందిరాన్ని శుభ్రం చేసి, ఇష్టదైవం ముందు దీపం వెలిగించాలి.
  •  ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయవచ్చు.
  •  శివుడికి అభిషేకం చేసి పూలు, పండ్లు సమర్పించాలి.
  • శనిదేవుడికి నువ్వులనూనెతో అభిషేకం చేయాలి.
  • శని దేవుడికి నల్లనువ్వులు, బెల్లం సమర్పించాలి. 
  • హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామం లేదా శివనామ స్మరణ చేయాలి.
  •  కార్తీక పురాణంలోని అధ్యాయాలను చదవాలి లేదా వినాలి.
  •  శక్తి మేరకు పేదలకు అన్నదానం, వస్త్రదానం వంటి సేవా కార్యక్రమాలు చేయాలి.

కార్తీక శని వారాల్లో భక్తితో పూజలు చేయడంతో పాటు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, దైవనామ స్మరణ చేయడం ఎంతో ముఖ్యమని పెద్దలు చెబుతారు. భక్తి, శ్రద్ధ, నియమనిష్టలతో ఈ రోజును గడిపితే భగవంతుడి అనుగ్రహం లభిస్తుందని... జాతక దోషాలు తొలగడమే కాకుండా .. అప్పుల బాధల నుంచి విముక్తి కలుగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.