తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. 2026 నవంబర్ 21 నుంచి డిసెంబర్ 15 వరకు కేవలం 25 రోజుల్లోనే ఏకంగా 52 లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయని ఆల్ ఇండియా వ్యాపారస్తుల సంఘం (CAIT) అంచనా వేసింది.అంటే రోజుకు సగటున 2 లక్షలకు పైగా పెళ్లిళ్లు జరుగుతున్నాయని నివేదిక ద్వారా తెలుస్తుంది. ఈ పెళ్లిళ్ల వల్ల దేశంలో ఏకంగా రూ. 7.5 లక్షల కోట్ల వ్యాపారం జరగనుందని CAIT తెలిపింది.
ఏ రంగాల్లో జోరు
ఈ పెళ్లిళ్ల సీజన్‌తో బంగారం, వస్త్రాలు, హోటళ్లు, క్యాటరింగ్, ఫోటోగ్రఫీ, డెకరేషన్, ట్రావెల్స్, బ్యూటీ పార్లర్లు.. ఇలా అన్ని రంగాల్లోనూ భారీగా డిమాండ్ పెరగనుంది.ఢిల్లీ-NCR లోనే 5 లక్షల పెళ్లిళ్లు జరిగి, రూ. 2.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా.
1.25 కోట్ల మందికి ఉపాధి
ఈ పెళ్లిళ్ల సీజన్ వల్ల దాదాపు 1.25 కోట్ల మందికి తాత్కాలిక ఉద్యోగాలు లభిస్తాయని CAIT చెప్పింది. క్యాటరింగ్, డెకరేషన్, ఫోటోగ్రఫీ, ఈవెంట్ మేనేజ్‌మెంట్ రంగాల్లో యువతకు భారీగా పని దొరుకుతుంది.గత ఏడాది (2025) ఇదే సీజన్‌లో 46 లక్షల పెళ్లిళ్లు జరిగి రూ. 6.5 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. ఈ ఏడాది అది 15.4% పెరిగి రూ. 7.5 లక్షల కోట్లకు చేరనుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. .మొత్తంగా ఈ 25 రోజులు దేశమంతా పెళ్లి బాజా.. భోజనాలు.. షాపింగ్‌లతో కళకళలాడనుంది.
