కార్తీకమాసంలో ఈ ఐదు రోజులు చాలా ముఖ్యమని పండితులు చెబుతున్నారు. నవంబర్ 20 నుంచి 24 వరకు భీష్మ పంచకం. ఈ నియమాలు పాటిస్తే కోటి జన్మల పాపం పోతుంది . మరి ఈ ఐదు రోజులు ఎలాంటి నిమయాలు పాటించాలో ఈస్టోరీలో తెలుసుకుందాం. . .!
కార్తీకమాసం కొనసాగుతుంది. శుక్లపక్షం చివరి దశకు చేరుకుంది. నవంబర్ 20 ఏకాదశి తిథికాగా.. ఇప్పటి నుంచి శుక్లపక్షం ఇంకా ఐదు రోజులు ఉఎంది. పురాణాల ప్రకారం ఈ ఏడాది( 2026) భీష్మ పంచకం నవంబర్ 20 నుంచి 24 వరకు జరగనుంది.
కార్తీక మాసం శుక్లపక్షంలోని చివరి ఐదు రోజులు ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు.ఈ మాసమంతా పూజలు, ఉపవాసాలు, దీపారాధనలు, దానధర్మాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా విష్ణుమూర్తిని, తులసి మాతను ఆరాధించడం ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. . కార్తీక శుక్ల ఏకాదశి నుంచి కార్తీక పౌర్ణమి వరకు ఈ ఐదు రోజులు భీష్మ పంచకంగా జరుపుకుంటారు. ఈ ఐదు రోజులనే ‘భీష్మ పంచకం’ అని పిలుస్తారు. మత విశ్వాసాల ప్రకారం, ఈ ఐదు రోజులలో విష్ణుమూర్తిని భక్తిశ్రద్ధలతో పూజించడం, ఉపవాసం ఉండటం, జపతపాలు చేయడం వల్ల విశేష పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
మహాభారతంలో అంపశయ్యపై ఉన్న భీష్మ పితామహుడు ఈ ఐదు రోజులు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశించాడని, అందుకే ఈ రోజులకు భీష్మ పంచకం అనే పేరు వచ్చిందని పండితులు చెబుతున్నారు. ఈ ఐదు రోజులు భీష్ముడికి తర్పణాలు వదిలి, విష్ణుమూర్తిని పూజిస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
భీష్మ పంచకం ఎప్పుడు?
ఈ ఏడాది భీష్మ పంచకం నవంబర్ 20 నుంచి నవంబర్ 24 వరకు వస్తుంది.
- నవంబర్ 20 - కార్తీక శుక్ల ఏకాదశి (ఉత్థాన ఏకాదశి)
- నవంబర్ 21 - ద్వాదశి
- నవంబర్ 22 - త్రయోదశి
- నవంబర్ 23 - చతుర్దశిన
- వంబర్ 24 - కార్తీక పౌర్ణమి
ఏం చేయాలి?
ఉపవాసం: ఈ ఐదు రోజులు భక్తులు ఉపవాసం ఉండి, పాలు, పండ్లు మాత్రమే తీసుకుంటారు. వీలుకాని వారు ఏకాదశి, పౌర్ణమి రోజైనా ఉపవాసం ఉండాలి
విష్ణు పూజ: ఉదయాన్నే తలస్నానం చేసి, విష్ణుమూర్తికి తులసి దళాలతో పూజ చేయాలి. విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి.
భీష్మ తర్పణం: భీష్మ పితామహుడికి నువ్వులు, నీళ్లతో తర్పణం వదలాలి. దీనివల్ల పితృదోషాలు తొలగిపోతాయని నమ్మకం.
దీపదానం: సాయంత్రం ఆవు నెయ్యితో దీపాలు వెలిగించి, దానం చేయాలి.
అన్నదానం: ఈ ఐదు రోజుల్లో అన్నదానం చేస్తే కోటి రెట్లు పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
ఈ 5 రోజులు ఏం తినకూడదు?
భీష్మ పంచకం సమయంలో ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం, మద్యం పూర్తిగా మానేయాలి. అలాగే బ్రహ్మచర్యం పాటించాలి. కోపం, అబద్ధాలు చెప్పడం వంటివి చేయకూడదు.
ఏం ఫలితం వస్తుంది?
భీష్మ పంచక వ్రతం చేసిన వారికి పాపాలు తొలగిపోయి, మోక్షం లభిస్తుందని విష్ణు పురాణం చెబుతోంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. ఈ ఐదు రోజులు విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందడానికి అత్యంత పవిత్రమైన సమయం. ఈ కాలంలో ఉపవాసం ఉండటం, తులసి పూజ, దీపారాధన, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం విశేష ఫలప్రదంగా భావిస్తారు. అలాగే పేదలకు అన్నదానం చేయడం, వస్త్రదానం, ఇతర దానధర్మాలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని నమ్ముతారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
