సూర్యపేటలో విషాదం..టిప్పర్ లారీ ఢీ కొని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, టీచర్ స్పాట్ డెడ్

సూర్యపేటలో విషాదం..టిప్పర్ లారీ ఢీ కొని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, టీచర్ స్పాట్ డెడ్

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాద ఘటన సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని బీబీగూడెం సమీపంలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. చివ్వేంల మండలంలోని మినీ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న కోట్ల రజిత, అదే పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న గుగులోతు రక్మ ద్విచక్ర వాహనంపై సూర్యాపేట నుంచి పాఠశాలకు బయలుదేరారు. ఈ క్రమంలో బీబీగూడెం సమీపంలో ఎదురుగా వచ్చిన టిప్పర్ లారీ వారి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.

ALSO READ : రేవంత్ ప్రస్టేషన్‌లో బూతులు మాట్లాడుతుండు..

ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ లారీ ఓ ఏ మిక్స్ కంపెనీకి చెందినదిగా గుర్తించారు. ఇద్దరు మహిళలు ఒకే పాఠశాలలో పనిచేస్తుండగా, విధులకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో విషాదం నెలకొంది.

ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.