ఏ ఇంటిలోనైనా ఆడపిల్ల పుట్టిందా.. మా ఇంట్లో లక్ష్మీదేవి పుట్టిందంటారు. ఇక శుక్రవారం.. మంగళవారం రోజుల్లో పుట్టిందా అంటే పెళ్లి అయిన తరువాత అత్తగారింటికి వెళ్లే సమయంలో భర్త కుటుంబం వారు ప్రధాన గుమ్మంపై బంగారం ఉంచి తరువాత గడప దాటిస్తారు. అంటే ఆడపిల్లకు తెలుగు ప్రజలు ఎంత గౌరవం ఇస్తారో ఇక వేరే చెప్పనక్కరలేదు. సంఖ్యాశాస్త్ర జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాలు ఆడపిల్ల కొన్ని తేదీల్లో జన్మిస్తే ఆ పిల్ల ఎవరింటికి కోడలుగా వెళితే.. ఆ ఇంట్లో సంపద.. ఐశర్యం వృద్ది చెందుతాయని పండితులు చెబుతున్నారు.
సంఖ్యాశాస్త్రం ప్రకారం జాతకాన్ని మూల సంఖ్య ఆధారంగాసంఖ్యాశాస్త్రం ప్రకారం పుట్టిన తేదీ ఆధారంగా వ్యక్తుల వ్యక్తిత్వం, అదృష్టం, ఆర్థిక స్థితిని అంచనా వేస్తారు. ముఖ్యంగా 6, 9 మూలాంకాల్లో జన్మించిన అమ్మాయిలు అదృష్టవంతులుగా ఉంటారని సంఖ్యాశాస్త్ర నిపుణులు విశ్వసిస్తారు.
మూలసంఖ్య 6: ఏ నెలలో అయినా 6,15, 24 తేదీల్లో పుట్టిన వారికి సంఖ్యా శాస్త్రం ప్రకారం మూల సంఖ్య 6 అవుతుంది. ఈ అంకె శుక్రుడికి సంబంధించినది. జ్యోతిష్యంలో శుక్రుడి ఆశీస్సులు ఉంటే ఐశ్వర్యం, కళలు, భోగభాగ్యాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని పండితులు చెబుతున్నారు. అయితే ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు కోడలుగా .. అత్తగారింట్లో అడుగుపెట్టిన భర్త ఇంట్లో సుఖ సంతోషాలు, ఆర్థిక సౌకర్యాలు పెరుగుతాయని పండితులు చెబుతున్నారు.
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వీరు విలాసవంతమైన జీవితాన్ని ఇష్టపడతారు. వీరు అందరిని కలుపుకొని పోతారు. 6,15, 24 తేదీల్లో పుట్టిన వారు నివసించే ఇంటిలో సాధారణంగా ఎలాంటి గొడవలు రావు. ప్రతి సమస్యను ఎంతో సమయస్ఫూర్తితో పరిష్కరించి కుటుంబసభ్యుల మధ్య ఉన్న మనస్సర్థలు తగ్గించే శక్తి వీరికి ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం ఏ ఇంట్లో గొడవలు.. కలహాలు ఉండవో ఆ ఇంట్లో చాలా ప్రశాంతత ఉంటుంది. ప్రశాంతత ఉన్న ప్రదేశంలో లక్ష్మీదేవి తిష్టవేసి ఉంటుందని పురాణాల ద్వారా తెలుస్తుంది.
మూలసంఖ్య 9: ఏ నెలలో అయినా 9,18,27 తేదీల్లో పుట్టిన వారికి మూలసంఖ్య9 అవుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 9 కుజుని గ్రహానికి సంబంధించినది. కుజుని శుభదృష్టి వలన ఈ తేదీల్లో జన్మించిన వారు నివసించే కుటుంబాలకు కొండం అండని పండితులు చెబుతున్నారు. ఈ తేదీల్లో జన్మించిన మహిళలు ధైర్యవంతులుగా, చురుగ్గా ఉంటారు. వీరు ఎలాంటి పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేయరని పండితులు చెబుతున్నారు.
సంఖ్యాశాస్త్ర నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం మూల సంఖ్యలు 6,9 వచ్చే తేదీల్లో జన్మించిన మహిళలు అత్తింటి కుటుంబానికి సంపద.. ఐశ్వర్యం తెచ్చి పడతారు. కుటుంబసభ్యులు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉంటారు. . పైకి కాస్త కటువుగా.. ముక్కుసూటిగా మాట్లాడినట్లు అనిపించినా.. ఆపదలో ఉన్న ఆత్మీయులను ఆదుకోవడంలో వీరు డూ ముందుంటారని నిపుణులు చెబుతున్నారు.
మరోముఖ్య విషయం ఏంటంటే.. పుట్టిన తేదీతో సంబంధం లేకుండా, ఏ ఇంట్లో అయితే మహిళలకు గౌరవం, ఆదరణ లభిస్తాయో ఆ ఇల్లు నిత్యం కళకళల్లాడుతుంది. ఆడబిడ్డలను గౌరవించే చోట దరిద్రం ఎన్నటికీ నిలవదని పండితులు చెబుతున్నారు. .
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
