‘ధురంధర్’ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటిన బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య ధర్ మరోసారి చేతులు కలపనున్నారనే వార్తలు ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ధురంధర్’ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకోవడంతో, నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై అంచనాలు మొదలయ్యాయి. అయితే ఈసారి యాక్షన్‌తో పాటు పౌరాణిక అంశాలను కూడా మేళవించి ఓ భారీ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు ఆదిత్య ధర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
అశ్వత్థామ కథ కాదట.. కొత్త మైథాలజికల్ స్టోరీ!
గతంలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా ‘ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ సినిమా తెరకెక్కనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఆ కథకు భిన్నంగా మరో సరికొత్త పౌరాణిక కథాంశంతో సినిమా రూపొందించేందుకు దర్శకుడు ఆసక్తి చూపిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం ఉందని టాక్.
చాణక్యుడిగా అక్షయ్ ఖన్నా.. చంద్రగుప్తుడిగా రణ్‌వీర్ సింగ్!
దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించనున్నట్లు ప్రచారం జరుగుతున్న భారీ చారిత్రక చిత్రానికి సంబంధించి ఆసక్తికరమైన క్యాస్టింగ్ వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో చాణక్యుడి పాత్రలో ‘ధురంధర్’ విలన్ అక్షయ్ ఖన్నా, యువ చంద్రగుప్త మౌర్యుడిగా రణ్‌వీర్ సింగ్ కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక మరో కీలక పాత్ర అయిన ధననందుడిగా కన్నడ స్టార్ యశ్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మలయకేతు పాత్రలో ఫహాద్ ఫాజిల్ కనిపించనున్నట్లు టాక్.
కథ విషయానికొస్తే.. ధననందుడి చేతిలో అవమానానికి గురైన చాణక్యుడు అతడి సామ్రాజ్యాన్ని కూల్చివేయాలని ప్రతిజ్ఞ చేయడం, చంద్రగుప్తుడిని తన శిష్యుడిగా తీర్చిదిద్ది రాజుగా నిలబెట్టడం కథలో కీలక ఘట్టాలుగా ఉండనున్నాయట. చివర్లో సెల్యూకస్‌తో యుద్ధం, అనంతరం చంద్రగుప్తుడు సన్యాస మార్గాన్ని ఎంచుకోవడం హైలైట్‌గా నిలుస్తాయని సమాచారం. అయితే ఈ క్యాస్టింగ్, కథనంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
🚨 Aditya Dhar and Ranveer Singh's new film storyline - Akshaye Khanna will play Chanakya - He'll be humiliated by Dhana nanda (Yash) - He'll vow to destroy his dynasty - Chanakya will discover young Chandragupta (Ranveer) - Together, they'll defeat Yash - Along the way, they'll defeat several kings, like Malayaketu (Fahadh Faasil) - Part 1 will end with Seleucus (Hrithik Roshan) entering the story. He's a Greek ruler - Chandragupta will fight and defeat his army but after witnessing mass destruction, he'll eventually become a monk If Aditya Dhar manages to portray this exactly as imagined, it'll be bigger than Baahubali 🙏
— Suprvirat (@MostlyKohli) November 18, 2026
