కార్తీకమాసం కొనసాగుతుంది. మరో నాలుగు రోజుల్లో ( నవంబర్ 20 వతేదీ నాటికి శుక్లపక్షం ముగియనుంది. ఏకాదశి ( నవంబర్ 20) వ తేది ముగిసింది.. ఇక ద్వాదశి ( నవంబర్ 21) రోజును క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుకా ద్వాదశి అని పిలుస్తారు. ఈ రోజున ఓ ఐదు పనులు చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. క్షీరాబ్ధి ద్వాదశి రోజు ఏమేమి చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . . !
కార్తీకమాసంలో నెల రోజులు చాలా పవిత్రమైన రోజలు. ఈనెలలో శుక్లపక్షం ద్వాదశి తిథి రోజున ( నవంబర్ 21) క్షీరాబ్ది ద్వాదశి.. ఈ పవిత్రమైన రోజున సాయంత్రం తులసిదేవిని... మహావిష్ణువును పూజిస్తారు. ఇలా చేయడం వలన కోరిన కోర్కెలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. కొంతమంది తులసీ కళ్యాణం కూడా చేస్తారు.
క్షీరాబ్ది ద్వాదశి( 2026 నవంబర్ 21) ఏం చేయాలి
- సూర్యోదయానికి ముందే కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేయాలి.
- దేవుడి మందిరం దగ్గర.. తులసి మొక్క దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి
- శివాలయానికి వెళ్లి పరమేశ్వరుడికి అభిషేకం చేసి బిల్వ పత్రాలు సమర్పించాలి.
- ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఉపవాసం ఉండాలి. ( ఏకాదశి ఉపవాసం ఉన్నవారు ఉండకూడదు)
- ఉసిరిచెట్టు కింద దీపారాధన చేయాలి.
- ఉసిరి చెట్టుకు పసుపు,కుంకుమ, అక్షింతలు సమర్పించాలి.
ఉసిరి చెట్టుకు పూజ చేస్తూ చదవాల్సిన మంత్రాలు
- 1. ఓం ధాత్రై నమః
- 2. ఓం ఇందిరాయై నమః
- 3. ఓం గాయత్రై నమః
- 4. ఓం శాంత్యె నమః
- 5. ఓం సుధృత్యై నమః
- 6. ఓం సావిత్రై నమః
- 7. ఓం కాంత్యై నమః
- 8. ఓం రమాయై నమః
- 9. ఓం విశ్వరూపాయై నమః
- 10. ఓం మేధాయై నమః
- 11. ఓం లోకమాత్రై నమః
- 12. ఓం సురూపాయై నమః
- 13. ఓం కళ్యాణ్యై నమః
- 14. ఓం అబ్ధితనయాయై నమః
- 15. ఓం కమనీయాయై నమః
- 16. ఓం విష్ణుపత్నై నమః
- 17. ఓం అవ్యక్తాయై నమః
- 18. ఓం మహాలక్ష్మ్యై నమః
- 19. ఓం కమలాయై నమః
- 20. ఓం ప్రకృత్యై నమః
- 21. ఓం జగద్ధాత్రై నమః
ఎనిమిది ప్రదక్షిణలు చేస్తూ చదవాల్సిన మంత్రం
ధాత్రీ దేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరి |
పుత్రాన్ దేహి మహాప్రాజ్ఞే యశో దేహి బలం చ మే ||
ప్రజ్ఞాం మేధాం చ సౌభాగ్యం విష్ణుభక్తిం చ శాశ్వతీమ్ |
నిరోగం కురు మాం నిత్యం నిష్పాపం కురు సర్వదా
సాయంత్రం ఏమి చేయాలంటే..!
దీపారాధన: సాయంత్రం సూర్యాస్తమయానికి స్నానం చేసి దేవుడి దగ్గర.. తులసికోట దగ్గర.. ఇంటి ప్రదాన గుమ్మం దగ్గర రెండు వైపులా దీపారాధన చేయాలి. ఇంటి ఆచారాన్ని బట్టి దీపాలు వెలిగించాలి. హరినామస్మరణ చేయాలి.
తులసమ్మకు పూజ: తులసి మొక్కను భక్తితో పూజించాలి. అమ్మవారిని ఆవాహన చేసి పసుపు.. కుంకుమ.. గంధం సమర్పించాలి. పూలతో అలంకరించాలి. తులసి అష్టోత్తరం.. లక్ష్మీ అష్టోత్తర నామాలను చదవాలి. . తరువాత ధూపం.. నైవైద్యం.. హారతి సమర్పించాలి. అమ్మవారిని ఆవాహన చేసిన తులసి మొక్కకు ప్రదక్షిణాలు చేయాలి. ఇలా చేయడం వలన అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
తులసి కల్యాణం: తులసీ మాతతో విష్ణువు లేదా కృష్ణపరమాత్మతో కళ్యాణం జరిపించడం వలన లక్ష్మీదేవి.. శ్రీహరి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
విష్ణు నామస్మరణ: విష్ణుసహస్రనామం పారాయణం చేయాలి. లేదా భక్తితో వినాలి. , శ్రీహరి స్తోత్రాలను చదువుతూ భజనలు చేయాలి.
చిలుక ద్వాదశి (క్షీరాబ్ది ద్వాదశి2026 నవంబర్ 21) రోజు బ్రాహ్మణులకు దక్షిణతో స్వయంపాకం.. వస్త్రాలు ఇవాలి. పేదలకు అన్నదానం.. అవసరం ఉన్న వారికి దుప్పట్లు, పండ్లు దానం చేయాలి. ఇలా చేయడం వలన మోక్ష మార్గంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. క్షీరాబ్ది ద్వాదశి రోజున చేసే చిన్న దానమైనా ఎక్కువ ఫలితం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
