Spirit: ‘స్పిరిట్’ VS ‘రామాయణం పార్ట్ 2’.. దీపావళికి బాక్సాఫీస్ క్లాష్ తప్పదా?

Spirit: ‘స్పిరిట్’ VS ‘రామాయణం పార్ట్ 2’.. దీపావళికి బాక్సాఫీస్ క్లాష్ తప్పదా?

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌‌‌‌లో  తెరకెక్కుతోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘స్పిరిట్’. భద్రకాళి పిక్చర్స్, టీ-సిరీస్ ఫిల్మ్స్ బ్యానర్లపై ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌‌‌‌ను అనౌన్స్ చేశారు. వాస్తవానికి ఈ సినిమాను 2027 మార్చి 5న విడుదల చేయాలని భావించగా, ఇప్పుడు ఈ సినిమాను 2027 అక్టోబర్ 29న దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

ఈ సందర్భంగా రిలీజ్ చేసిన కొత్త పోస్టర్‌‌‌‌‌‌‌‌లో ప్రభాస్ స్టైలిష్, ఇంటెన్స్ లుక్‌‌‌‌లో ఇంప్రెస్ చేస్తున్నాడు. బ్లాక్ క్యాప్, డార్క్ సన్‌‌‌‌గ్లాసెస్, గడ్డంతో ఉన్న ఆయన లుక్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. బ్లాక్ అండ్ వైట్ విజువల్స్‌‌‌‌కు ఎరుపు రంగులో ఉన్న టైటిల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా కనిపించనున్నాడు. త్రిప్తి డిమ్రి హీరోయిన్‌‌‌‌గా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో  ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ సినిమాను  మార్చి 18న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఈనెల 23న ప్రభాస్ బర్త్‌‌‌‌డే సందర్భంగా ఈ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌తో పాటు రిలీజ్ డేట్‌‌‌‌ను అనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది.  

‘స్పిరిట్’ VS ‘రామాయణం పార్ట్ 2’..

2027 దీపావళి సీజన్‌లో బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోటీ కనిపించే అవకాశముంది. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’ను అక్టోబర్ 29, 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. మరోవైపు రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘రామాయణ పార్ట్ 2’ కూడా దీపావళి 2027 విడుదలకు సిద్ధమవుతోంది.

‘స్పిరిట్’లో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుండగా, ‘రామాయణం పార్ట్ 2’లో రణ్‌బీర్ కపూర్ రాముడి పాత్రలో అలరించనున్నారు. రెండు భారీ చిత్రాలు ఒకే సీజన్‌లో విడుదలైతే బాక్సాఫీస్ పోటీ ఆసక్తికరంగా మారనుంది. దీంతో ఈ రెండు సినిమాలు ఒకే రోజు థియేటర్లలోకి వస్తాయా లేదా అనేది వేచి చూడాలి. కాగా రామాయణ ఫస్ట్ పార్ట్ నవంబర్ 5, 2026న రిలీజ్ కానుంది. 

షూటింగ్ ఆలస్యమైందా?

భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’కు సంబంధించి షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల పురోగతి కూడా విడుదల తేదీని నిర్ణయించడంలో కీలకంగా ఉండవచ్చు. అయితే షూటింగ్ ఆలస్యమే వాయిదాకు ప్రధాన కారణమని సినీ వర్గాలు అంటున్నాయి. అయితే, గతంలో సినిమా షెడ్యూల్ ప్రకారమే విడుదలవుతుందని సందీప్ రెడ్డి వంగా ధీమా వ్యక్తం చేసిన  విషయం తెలిసిందే.