Nithiin: నితిన్ నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఫిక్స్.. మీనాక్షి చౌదరితో క్రేజీ కాంబో!

Nithiin: నితిన్ నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఫిక్స్.. మీనాక్షి చౌదరితో క్రేజీ కాంబో!

వరుస ఫ్లాపులతో ఇబ్బందిపడుతున్న నితిన్ ఈసారి కథల ఎంపికలో రూటు మార్చారు. రొటీన్‌కు భిన్నంగా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌లతో సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ‘అలియాస్ రుక్మిణి’పై భారీ ఆశలు పెట్టుకున్న ఆయన.. డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే టీజర్ విజువల్స్ సినిమాపై బజ్ క్రియేట్ చేశాయి. ఈ క్రమంలోనే మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్ చేయనున్నారని సినీ వర్గాల్లో టాక్ మొదలైంది. 

రామ్ అబ్బరాజుతో కామెడీ ఎంటర్‌టైనర్..

‘సామజవరగమన’, ‘నారి నారి నడుమ మురారి’ వంటి చిత్రాలతో తనదైన కామెడీ టైమింగ్, కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు దర్శకుడు రామ్ అబ్బరాజు. ఇప్పుడు నితిన్ కోసం ఆయన ఓ ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వినోదాత్మక అంశాలతో పాటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ కథను రూపొందించారట. నితిన్‌కు కూడా ఈ కథ నచ్చడంతో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి పేరు పరిశీలిస్తున్నారు. త్వరలోనే అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. 

మైత్రీ మూవీ మేకర్స్‌తో నితిన్ మరోసారి..

గతంలో ‘రాబిన్‌హుడ్’ సినిమా కోసం మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి పనిచేశారు నితిన్. ఇప్పుడు మరోసారి ఇదే బ్యానర్‌లో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్‌పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రామ్ అబ్బరాజు శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిస్తున్న ‘ఫ్యామిలీ ప్యాక్’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

ALSO READ : వీకెండ్ స్పెషల్.. ఓటీటీలోకి 8 క్రేజీ సినిమాలు..

‘అలియాస్ రుక్మిణి’పై భారీ ఆశలు..

మరోవైపు నితిన్ నటిస్తున్న ‘అలియాస్ రుక్మిణి’ డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే టీజర్‌తో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. వరుస ఫ్లాపుల తర్వాత ఈ సినిమాతోనైనా నితిన్ హిట్ ట్రాక్ ఎక్కుతారేమో చూడాలి. ఇక ‘ఫ్యామిలీ ప్యాక్’ విడుదల తర్వాత రామ్ అబ్బరాజు ఈ కొత్త ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టనున్నారట. వచ్చే ఏడాది ప్రారంభంలోనే షూటింగ్ మొదలయ్యే అవకాశముంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.