శ్రీవారికి నిలువెత్తు బంగారు ఆభరణాలు లిస్ట్ ఇదే.. కిరీటం నుంచి పాదాల వరకు ఇలా..!

శ్రీవారికి నిలువెత్తు బంగారు ఆభరణాలు లిస్ట్ ఇదే.. కిరీటం నుంచి పాదాల వరకు ఇలా..!

దేశ వ్యాప్తంగా ఓ చర్చ నడుస్తుంది. కలియుగ వేంకటేశ్వరస్వామికి చెన్నైకి చెందిన ఓ భక్తుడు నిలువెత్తు ఆభరణాలు సమర్పించారు. 106 కేజీలతో.. శ్రీవారికి నిలువెత్తు బంగారు ఆభరణాలు సమర్పించారు. చెన్నైకి చెందిన వర్థమాన్ జైన్ కుటుంబం సమర్పించిన నిలువెత్తు బంగారు ఆభరణాలు లిస్ట్ ఇలా ఉంది. 

నిలువెత్తు ఆభరణాలు ఇవే : 

1. బంగారు పాద కవచములు -3
2. బంగారు అందెలు -3
3. బంగారు పాకడాలు
4. బంగారు తులసిపాత్ర హారం
5. బంగారు అష్టోత్తర కాసుల మాల
6. బంగారు చతుర్భుజ లక్ష్మీ హారం
7. బంగారు పులిగోరు
8. బంగారు అశ్వథ పాత్ర హారము
9. బంగారు సాదా వడ్డాణము
10. బంగారు గంటల మొలతాడు
11. బంగారు సూర్యకటారి
12. బంగారు కౌస్తుభం
13. బంగారు శ్రీవత్సం
14. బంగారు మోచేయి
15. బంగారు కటి హస్తం
16. బంగారు నాగాభరణ వడ్డాణము
17. బంగారు గోపు
18. బంగారు ఐదు పేటల కంఠీలు 5
19. బంగారు చంద్రవంకీ కంఠీ
20. బంగారు వైకుంఠ హస్తము
21. బంగారు కటి హస్తము
22. బంగారు నాగాభరణ కడియాలు 4
23. బంగారు భుజ కీర్తులు 3
24. బంగారు కర్ణపత్రములు 3
25. బంగారు భావళీలు -3 
26. బంగారు సాలిగ్రామ హారములు- 3
27. బంగారు కమలం తరహా సాలిగ్రామాలు 3
28. బంగారు మోపుగల యజ్ఞోపవీతం 
29. బంగారు శంఖ కవచము
30. బంగారు చక్ర కవచము
31. బంగారు కిటీపు ముఖపట్టి
32. బంగారు కిరీటము

>>> ఆభరణాల తయారీలో వజ్రాలు కూడా ఉన్నాయి.  2 వేల427 కేరట్ల బరువున్న నీలాలు, పుష్యరాగం, కెంపులు, పచ్చలతో శ్రీవత్సం పతకం
>>> 238 కేరట్ల బరువున్న వజ్రాలను పొదిగిన ఆభరణాలు

అదే విధంగా శ్రీ పద్మావతీ అమ్మవారికి 15 కేజీల బరువైన బంగారు వస్త్రం సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే ఒక కుటుంబం ఇన్ని ఆభరణాలు సమర్పించటం ఇదే మొదటిసారి. తిరుమల ఆలయంలోనే ఈ ఆభరణాలను సీఎం చంద్రబాబు సమక్షంలో శ్రీవారికి సమర్పించారు. ఈ ఆభరణాలను టీటీడీ అధికారులు లెక్కలు రాసుకుని మరీ శ్రీవారి ఖజానాలో భద్రపరిచారు.