OTT New Movies: వీకెండ్ స్పెషల్.. ఓటీటీలోకి 8 క్రేజీ సినిమాలు..

OTT New Movies: వీకెండ్ స్పెషల్.. ఓటీటీలోకి 8 క్రేజీ సినిమాలు..

వీకెండ్ రేపటి నుంచి మొదలవ్వనుంది.. ఇక ఎంచక్కా ఇంట్లోనే హాయిగా కూర్చొని కొత్త సినిమాలు చూడాలనుకునే ఓటీటీ ప్రేక్షకులకు ఈ శుక్రవారం అదిరిపోయే ట్రీట్ సిద్ధమైంది. నవంబర్ 27న (శుక్రవారం) పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో విభిన్న జానర్లకు చెందిన 8 సినిమాలు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. యాక్షన్ కామెడీ, మిస్టరీ థ్రిల్లర్, రొమాంటిక్ డ్రామా, క్రైమ్ థ్రిల్లర్, యాక్షన్ డ్రామా.. ఇలా ఒక్కో సినిమా ఒక్కో ప్రత్యేకతతో ప్రేక్షకుల ముందుకు రానుంది. నెట్‌ఫ్లిక్స్, జీ5, మనోరమ మ్యాక్స్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో సందడి చేయనున్న ఈ సినిమాలతో ఈ వీకెండ్ వినోదానికి కొదవ ఉండదనే చెప్పాలి. మరి ఆ ఐదు సినిమాలేంటి? వాటి స్టోరీ బ్యాక్ డ్రాప్ ఏంటి? ఎందులో స్ట్రీమింగ్ కానున్నాయి? అనేది తెలుసుకుందాం.

AK: 47

వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్: 47’ నవంబర్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఓ సామాన్య కుటుంబానికి అనుకోకుండా రూ.100 కోట్ల లాటరీ తగలడం.. ఆ తర్వాత ఖరీదైన విల్లాలోకి మారిన ఆ కుటుంబానికి ఎదురైన సమస్యల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. అక్టోబర్ 30న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

ఆక్టోపస్ (Octopus)

మిస్టరీ, సస్పెన్స్ ఇష్టపడేవారికి ‘ఆక్టోపస్’ మంచి థ్రిల్లింగ్ ట్రీట్ కానుంది. కొత్తగా పెళ్లైన వరుణ్, నిఖిత దంపతుల జీవితంలో చోటుచేసుకున్న ఓ అనూహ్య సంఘటన కథలో కీలక మలుపు. నిఖిత అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో అసలు ఏం జరిగిందనే ఉత్కంఠ మొదలవుతుంది. ఆమె అదృశ్యం వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించే క్రమంలో ఒక్కో షాకింగ్ నిజం బయటపడుతుంది. అశ్విన్ కుమార్, అర్చన రవిచంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ నవంబర్ 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.

దృశ్యం 3 - హిందీ

హిందీ దృశ్యం 3 ఓటీటీలోకి రానుంది. సామ్ హత్య కేసులో కొత్త ఆధారాలు బయటపడటంతో విజయ్ సాల్గావ్కర్ (అజయ్ దేవగణ్) కుటుంబం మరోసారి చిక్కుల్లో పడుతుంది. ఎస్పీ రాజ్‌వీర్ సింగ్ తోమర్ (జైదీప్ అహ్లావత్) దర్యాప్తు ప్రారంభించడంతో కుటుంబాన్ని కాపాడుకునేందుకు విజయ్ ఎలాంటి వ్యూహాలు రచించాడనేదే ఈ మిస్టరీ థ్రిల్లర్ కథ. తెలివితేటలు, మైండ్ గేమ్స్‌తో సాగే ఈ మూవీ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతోంది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది.

‘హనుమాన్ అంశ్’ 

ఆధ్యాత్మికత, భక్తి, మానవీయ విలువల నేపథ్యంలో రూపొందిన కథ ‘హనుమాన్ అంశ్’. తల్లిని కోల్పోయిన ఓ చిన్నారి ఆధ్యాత్మిక ప్రయాణం, భక్తి, నిస్వార్థ సేవ, మానవీయ విలువల నేపథ్యంలో సాగే కథే ‘హనుమాన్ అంశ్’. జీవితంలో ఎదురైన పరిణామాలతో అతడు నీమ్ కరోలి బాబా (శోభినవ్ సత్యా)గా ఎలా మారాడనేదే ఈ కథాంశం. రేపు నవంబర్ 27 నుంచి సోనీలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

కార్పొరేట్ లవ్ స్టోరీ

లవ్, కెరీర్, ఆఫీస్ పాలిటిక్స్ నేపథ్యంలో సాగే కన్నడ రొమాంటిక్ డ్రామా ‘కార్పొరేట్ లవ్ స్టోరీ’. బెంగళూరులోని ఓ డేటింగ్ యాప్ స్టార్టప్‌లో పనిచేసే నిత్య, అర్జున్‌ల మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. అయితే ఉద్యోగ ఒత్తిళ్లు, వ్యక్తిగత ఆశయాలు, ఆఫీస్‌లో ఎదురయ్యే సవాళ్లు వారి ప్రేమకు పరీక్ష పెడతాయి. కెరీర్, ప్రేమ మధ్య ఈ జంట ఎలాంటి సంఘర్షణను ఎదుర్కొంది? చివరకు వారి బంధం ఏమైంది? అనేదే ఈ కథాంశం. ప్రియాంక ఉపేంద్ర, సంజన దాస్, ప్రణవ్ శ్రీధర్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబర్ 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.

సత్యమేవ (Sathyameva)

20 ఏళ్లుగా మిస్టరీగా మిగిలిపోయిన ఓ యువతి అదృశ్యం.. దాని వెనుక దాగిన అసలు నిజాన్ని వెలికితీసే ప్రయత్నమే ‘సత్యమేవ’ కథాంశం. మరణానికి ముందు ఓ తండ్రి చేసిన చివరి కోరికతో ఓ న్యాయవాది ఈ పాత కేసును తిరిగి దర్యాప్తు చేయడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో ఊహించని రహస్యాలు, కొత్త ఆధారాలు బయటపడతాయి. అసలు ఆ యువతి ఏమైంది? ఆమె అదృశ్యం వెనుక ఎవరున్నారు? అనే ఉత్కంఠభరిత అంశాలతో ఈ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సాగుతుంది. రోనీ డేవిడ్ రాజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా నవంబర్ 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.

లా అండ్ ఆర్డర్ (Law and Order)

పోలీస్ యాక్షన్, క్రైమ్ డ్రామాలను ఇష్టపడేవారికి ‘లా అండ్ ఆర్డర్’ ఆసక్తికరమైన ఎంపిక. ఓ నిజాయితీ గల పోలీస్ అధికారి, ఐదుగురు యువ పోలీస్ అకాడమీ గ్రాడ్యుయేట్లతో కలిసి ప్రమాదకరమైన నేర ముఠాను ఎదుర్కొనే నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. అనుకోని విషాద ఘటనతో కథలో ఉత్కంఠ మరింత పెరుగుతుంది. ఇక మమ్ముట్టి ప్రత్యేక పాత్రలో కనిపించనుండటం ఈ సినిమాకు మరో ఆకర్షణ. 2004లో వచ్చిన ‘బ్లాక్’ చిత్రంలోని కరిక్కమూరి షణ్ముఖన్ పాత్రలో ఆయన మరోసారి కనిపించనున్నట్లు సమాచారం. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ మలయాళ యాక్షన్ డ్రామా నవంబర్ 27 నుంచి మనోరమ మ్యాక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.

ధాయ్ చాల్ (Dhai Chaal)

కాలేజీ రాజకీయాల నేపథ్యంలో సాగే పొలిటికల్ డ్రామా ‘ధాయ్ చాల్’. గగన్ అరోరా ప్రధాన పాత్రలో నటించిన ఈ కథలో మయూర్ భరద్వాజ్ అనే కాలేజీ విద్యార్థి నాయకుడి ప్రయాణం ఆసక్తికరంగా సాగుతుంది. క్యాంపస్ ఎన్నికల్లో పాల్గొనే క్రమంలో బయటి రాజకీయ నాయకుల ప్రభావానికి లోనవుతాడు మయూర్. ఈ క్రమంలో రాజకీయాల్లోని ఎత్తులు, పొత్తులు, నమ్మకద్రోహాలను దగ్గరగా చూస్తాడు. ప్రతి నిర్ణయానికీ ఓ పరిణామం ఉంటుందని తెలుసుకుంటూ ముందుకు సాగుతాడు. ఈ పొలిటికల్ డ్రామా నవంబర్ 27 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.

ఈ వీకెండ్ ఏ సినిమా చూడాలి?

ఈ ఐదు సినిమాల్లో ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్: 47’ ఇప్పటికే థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు ఓటీటీలో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. మిగతా సినిమాలకు సంబంధించిన బాక్సాఫీస్ వసూళ్ల వివరాలు అందుబాటులో లేవు. 

మొత్తంగా ఈ వీకెండ్ ఓటీటీ ప్రేక్షకులకు ఐదు విభిన్న జానర్ల సినిమాలు వినోదాన్ని పంచనున్నాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ కావాలంటే ‘ఆదర్శ కుటుంబం’, మిస్టరీ థ్రిల్లర్ కోసం దృశ్యం 3, ‘ఆక్టోపస్’, ప్రేమకథల కోసం ‘కార్పొరేట్ లవ్ స్టోరీ’, క్రైమ్ సస్పెన్స్ కోసం ‘సత్యమేవ’, పవర్‌ఫుల్ పోలీస్ యాక్షన్ కోసం ‘లా అండ్ ఆర్డర్’ చూసేయొచ్చు..