ఒక్క లాటరీ టికెట్‌తో కోటీశ్వరులయ్యే అవకాశం.. అదృష్టం కలిసొస్తే రూ.25 కోట్ల జాక్‌పాట్ సొంతం! క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా ప్రకటించిన ఈ బంపర్ లాటరీలో తొలి బహుమతిగా రూ.25 కోట్లు, రెండో బహుమతిగా 24 మందికి రూ.కోటి చొప్పున అందుతుంది. క్రిస్మస్, న్యూఇయర్ సందర్భంగా కేరళ ప్రభుత్వం ఆఫర్ చేసిన ఈ బంపర్ లాటరీపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. లాటరీ గెలిస్తే వచ్చే రూ.25కోట్లతో టాక్సులు పోను విజేత చేతికి ఎంత వస్తుంది..? కేరళవాళ్లు మాత్రమే కొనుక్కోవచ్చా, ఇతర రాష్ట్రాల వాళ్లు కూడా కొనుగోలు చేయొచ్చా.. ఇలా అనేక ప్రశ్నలతో ఈ లాటరీ జాక్ పాక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే..
ఒక్క టికెట్‌తో రూ.25 కోట్ల జాక్‌పాట్ గెలుచుకునే అవకాశం.. అదృష్టం కలిసొస్తే రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యే ఛాన్స్! కేరళ ప్రభుత్వం క్రిస్మస్–న్యూ ఇయర్ బంపర్ లాటరీ 2026–27ను ప్రారంభించింది. ఈసారి మొదటి బహుమతిగా ఏకంగా రూ.25 కోట్లు ప్రకటించింది. రెండో బహుమతిగా 24 మందికి రూ.కోటి చొప్పున, మూడో బహుమతిగా మరో 24 మందికి రూ.10 లక్షల చొప్పున అందించనుంది. మొత్తం 7,66,992 బహుమతులు విజేతలను వరించనున్నాయి.
టికెట్ ధర ఎంత? డ్రా ఎప్పుడు?
ఈ బంపర్ లాటరీ టికెట్ ధరను రూ.450గా నిర్ణయించారు. నవంబర్ 28, 2026 నుంచి టికెట్ల విక్రయాలు ప్రారంభం కానున్నాయి. 2027 ఫిబ్రవరి 1న తిరువనంతపురంలో లాటరీ డ్రా నిర్వహిస్తారు. టికెట్లను అధికారిక లాటరీ ఏజెంట్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలి. ఆన్‌లైన్ విక్రయాలు చట్టబద్ధం కాదని అధికారులు హెచ్చరిస్తున్నారు.
రూ.25 కోట్లు గెలిస్తే చేతికి వచ్చేది ఎంత?
బహుమతిగా రూ.25 కోట్లు ప్రకటించినప్పటికీ విజేతకు పూర్తి మొత్తం అందదు. కేరళ లాటరీ విధానం ప్రకారం 10 శాతం ఏజెంట్ కమిషన్ కింద రూ.2.50 కోట్లు, 30 శాతం టీడీఎస్ కింద రూ.6.75 కోట్లు మినహాయిస్తారు. దీంతో తొలుత విజేత ఖాతాలోకి రూ.15.75 కోట్లు జమ అవుతాయి. అయితే పన్ను బాధ్యత అక్కడితో ముగియదు. సర్‌ఛార్జ్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ వంటి అదనపు పన్నులు కూడా వర్తిస్తాయి. గతంలో ఇదే రూ.25 కోట్ల బహుమతికి వర్తించిన లెక్కల ప్రకారం ఇవన్నీ కలిపి చూస్తే విజేత చేతికి చివరకు సుమారు రూ.12.88 కోట్లు మాత్రమే మిగులుతాయి. తాజా పన్ను నిబంధనల ప్రకారం తుది మొత్తం మారవచ్చు.
ALSO READ : హైదరాబాద్ మరో బెంగళూరు కాకూడదంటే.. ట్రాఫిక్ మార్పులకు వెనకడుగు వేయొద్దు
అంటే ప్రకటించిన రూ.25 కోట్లలో దాదాపు సగం వరకు కమిషన్లు, పన్నుల రూపంలో తగ్గిపోవచ్చు. అందుకే జాక్‌పాట్ గెలిచిన ఆనందంతో పాటు పన్నుల లెక్కలపై కూడా విజేతలు అవగాహన కలిగి ఉండాలి.
VIDEO | Thiruvananthapuram: Keralam CM VD Satheesan (@vdsatheesan) releases Christmas-New Year bumper lottery. (Source: Third Party) (Full video available on PTI Videos - https://t.co/d8jp61yd2p) https://t.co/zuZP2jjLH7
— Press Trust of India (@PTI_News) November 26, 2026
