Health Tips: షుగర్ ని తగ్గించే.. కిచెన్ ఇంగ్రీడియెన్స్

Health Tips: షుగర్ ని తగ్గించే.. కిచెన్ ఇంగ్రీడియెన్స్

టీ, కాఫీ, స్వీట్లు.. ఇలా రోజువారీ ఆహారంలో తెలియకుండానే చాలామంది అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. దీనివల్ల బరువు పెరగడం, రక్తంలో చక్కెర స్థాయులు పెరగడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఒక్కసారిగా చక్కెర పదార్థాలకు దూరమైతే కొందరిలో అలసట, తలనొప్పి వంటి ఇబ్బందులు కనిపించవచ్చు. అయితే తీపి తినాలనే కోరికను తగ్గించుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు తోడ్పడే కొన్ని సుగంధ ద్రవ్యాలు మన వంటింట్లోనే ఉన్నాయి. యాలకులు, కొత్తిమీర, నల్ల మిరియాలు, పసుపు, లవంగాలు, దాల్చినచెక్క వంటి వాటిలో ఉండే పోషక, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం.

షుగర్ కి ఆల్టర్నేట్ గా యాలకుల్ని తినాలి. కమ్మని వాసన, రుచి ఉన్న ఇవి స్వీట్లు తినాలనే కోరిక రానీయవు.
ఫ్రీరాడికల్స్ ఇన్సులినిని విడుదల చేసే కణాల్ని డ్యామేజ్ చేస్తుంటాయి. ఫ్రీరాడికల్స్ ని బయటకి పంపించి, ఇన్సులిన్ రిలీజ్ ని పెంచడంలో కొత్తిమీర బాగా పనిచేస్తుంది.
నల్ల మిరియాల్లో పైపెరిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. దీని యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఆరోగ్య సమస్యలు రాకుండా చూస్తాయి.
పసుపులోని కర్ క్యుమిన్ అనే ఆల్కలాయిడ్ ఇన్ ఫ్లమేషన్ తగ్గిస్తుంది. అంతేకాదు జీర్ణ సమస్యలు రాకుండా చూస్తుంది.

ALSO READ : వంటింట్లో తయారు చేసే నేచురల్ హెయిర్ ఆయిల్స్‌తో జుట్టు ఒత్తుగా, హెల్దీగా!

లవంగాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గడంలో సాయపడతాయి.
యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలున్న దాల్చినచెక్క ఇన్సులిన్ సిగ్నలింగ్ ని ఇంప్రూవ్ చేస్తుంది.