తిరుమల చరిత్రలోనే భారీ విరాళం : శ్రీవారిని దర్శించుకున్న దాతలు

తిరుమల చరిత్రలోనే భారీ విరాళం : శ్రీవారిని దర్శించుకున్న దాతలు

తిరుమల శ్రీవారికి ఓ  భక్తుడు భారీగా విరాళాన్ని సమర్పించారు.  121 కేజీల బంగారు ఆభరణాల సెట్​ ను  వర్దమాన్​జైన్​ అనే భక్తుడు విరాళంగా సమర్పించారు. టీటీడీ చరిత్రలో ఒకేసారి ఒక భక్తుడి నుంచి ఇంత భారీ స్థాయిలో బంగారు ఆభరణాలు అందడం ఇదే తొలిసారి.   ఈ ఆభరణాల అంచనా విలువ సుమారు రూ. 150 కోట్ల నుంచి రూ. 160 కోట్ల వరకు ఉంటుంది వీటిని 9 సెట్లుగా విభజించి మొత్తం 45 ఆభరణాలుగా రూపొందించారు.

తిరుమల శ్రీవారి గర్భాలయంలోని మూలవిరాట్టుతో పాటు ఉత్సవమూర్తుల అలంకరణకు ఇప్పటికే దాదాపు 650 కేజీల ఆభరణాలు ఉన్నాయి. వీటి విలువ దాదాపు రూ.6 వేల కోట్లకు పైమాటే. వాటిలో పొదిగిన వజ్రాలు, రత్నాలు, కెంపులు కూడా కలిపితే వాటి విలువ రూ.10 వేల కోట్లు ఉంటుందని అంచనా. ఇవన్నీ పురాతన కాలం నుంచి ఒక్కొక్కటిగా శ్రీవారికి భక్తులు సమర్పించారు.

తిరుమల స్వామికి రత్నఖచిత, వజ్ర వైడూర్యాలు పొదిగిన బంగారు ఆభరణాలు ప్రతివారం అభిషేకం తరువాత అలంకరిస్తుంటారు. నిత్యాభరణాలుగా పిలిచే వజ్రాల శంఖుచక్రాలు, రత్నాల శంఖుచక్రాలు, రత్నాల కర్ణపత్రాలు, రత్నాల మకరకంఠి, రత్నాల కటి హస్తం, రత్నాల వైకుంఠ హస్తం, స్వర్ణ యజ్ఞోపవీతం, స్వర్ణ పాదాలు, అష్టోత్తర శతనామ హారం, సహస్రనామం, సూర్య కఠారి, కడియాలు, కర భూషణాలు, భుజదండ భూషణాలు, నాగాభరణాలు, భుజకీర్తులు, సాలిగ్రామ హారం, తిరుక్కోళం, ఆకాశరాజు కిరీటం, వజ్ర అశ్వత్థపత్ర హారం, ముఖపట్టీ, ఐదు పేటల కంఠి, చంద్రవంక కంఠి, పాగడాలు, కాంచీగుణం, అంకెలు, వడ్డాణాలు, గోపు హారం, స్వర్ణ యజ్ఞోపవీతం, తులసీ పత్రహారం, పులిగోరు హారం ఇలా చాలానే నిత్యాభరణాలుగా ఉన్నాయి.

ALSO READ : తెలంగాణ నీళ్లపై చంద్రబాబు కుట్ర

వీటితో సహా ప్రసాదపు మాల, లక్ష్మీహారం, పచ్చ పొదిగిన కంఠాభరణం, వక్షస్థల లక్ష్మి, లక్ష్మీ హారాలు, సాలగ్రామ హారం శ్రీవారిపై ఉంచుతారు. మిగిలిన ఆభరణాలు మూడు జతలకు పైగా ఉండటంతో టీటీడీ వాటిని అవసరాలకు అనుగుణంగా మార్పిడి చేస్తుంటుంది. తాజా విరాళంతో శ్రీవారి అలంకరణకు మరో సెట్ జత కానుంది.