గుడ్లను బయట ఉంచాలా ? ఫ్రిజ్‌లో పెట్టాలా ? ఏది మంచిదో తెలుసా ?

గుడ్లను బయట ఉంచాలా ? ఫ్రిజ్‌లో పెట్టాలా ?   ఏది మంచిదో తెలుసా ?

చాలామంది గుడ్లు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయని ఫ్రిజ్‌లో నిల్వ చేస్తుంటారు. అయితే గుడ్లను ఫ్రిజ్‌లో పెట్టడం మంచిదేనా? బయటకు తీసినప్పుడు వాటిలో బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉందా ? గుడ్ల నిల్వ విషయంలో నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం....

గుడ్లని ఫ్రిజ్లో స్టోర్ చేయడం మనలో చాలామంది చేసే పని. కానీ, ఫ్రిజ్లో ఎగ్స్ స్టోర్ చేయడం 'యమా డేంజర్' అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఫ్రిజ్లో రోజుల తరబడి ఉంచిన గుడ్లని తినడం వల్ల ప్రొటీన్, క్యాల్షియం అందడం మాట అటుంచితే లేనిపోని జబ్బులొస్తాయని హెచ్చరిస్తున్నారు ఎక్స్పర్ట్స్. ఫ్రిజ్లో ఉన్న గుడ్లని బయటికి తీసినప్పుడు వాటి టెంపరేచర్ మారిపోయి పాడైపోతాయి. గుడ్ల పెంకులపై పెద్ద మొత్తంలో బ్యాక్టీరియా ఏర్పడి అది గుడ్డు లోపలకి పోతుంది. 

అలాంటి గుడ్లు తినడం వల్ల అనారోగ్య సమస్యలొస్తాయి. అందువల్ల గుడ్లని ఫ్రిజ్ లో స్టోర్ చేయడం మంచిది కాదు అంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. మరీ ముఖ్యంగా ఆరోగ్యం పేరుతో  పిల్లలకు బ్యాక్టీరియా నిండిన గుడ్లు పెట్టొదంటున్నారు. మామూలు గది ఉష్ణోగ్రతలోనూ చాలా రోజుల పాటు గుడ్లు పాడవకుండా ఉంటాయి. కాబట్టి ఇకనుంచైనా ఫ్రిజ్లో గుడ్లు స్టోర్ చేయొద్దు.

ALSO READ : షుగర్‌కు బదులుగా ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వాడుతున్నారా?