హెల్త్ కాన్షియస్ పేరుతో కొందరు, షుగర్ కి సబ్ స్టిట్యూట్ గా మరికొందరు ఆర్టిఫీషియల్ స్వీట్స్ ను తెగ తినేస్తున్నారు. కొందరు డయాబెటిక్ పేషెంట్స్ వీటివల్ల ఎలాంటి హాని జరగదని రోజుకి నాలుగైదు కప్పుల టీ, కాఫీల్లో వీటిని కలి కలిపేస్తున్నారు. కమర్షియల్ యాడ్స్ బుట్టలో పడిపోయి టీ, కాఫీల్లోనే కాకుండా స్వీట్స్ తయారీలోనూ వీటినే వాడుతున్నారు ఈ మధ్య. కానీ, ఇవి ఎంతవరకు సేఫ్? అని అడిగితే న్యూట్రీషియన్లు మాత్రం వీటి జోలికి వెళ్లకపోవడమే మంచిదంటున్నారు.
ఆర్టిఫీషియల్ స్వీట నర్స్ ఓ ఫ్యాన్సీ ఇంగ్రెడియంట్ గా మారాయి ఈ మధ్య. దానికి కారణం టీవీల్లో వచ్చే కమర్షియల్ యాడ్స్. ఆ యాడ్స్ చూసి షుగర్ వల్ల నష్టం జరిగిపోతుందని దానికి బదులుగా వీటినే వాడుతున్నారు. కానీ, ఇది ఓ కెమికల్ మాత్రమేఅంటున్నారు న్యూట్రీషియనిస్ట్ మనీషా చోప్రా. డయాబెటిక్ పేషెంట్స్ ఆర్టిఫీషియల్ స్వీట్ నర్స్ ని తీసుకోవడం వల్ల ఇన్సులిన్ లెవల్స్ కంట్రోల్లో ఉన్నమాట నిజమే అయినా. వీటిని రెగ్యులర్ గా తింటే శరీరానికి నష్టం జరుగుతుందంటున్నారు.
ALSO READ : వీపు నొప్పే కదా అని లైట్ తీసుకుంది.. తీరా చూస్తే హార్ట్ ఎటాక్ ! మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త !
గర్భిణీలు, పిల్లలకి పాలిచ్చే తల్లులు వీటికి దూరంగా ఉండాలంటున్నారు. జర్నల్ ఆఫ్ ఫార్మకాలజీ & ఫార్మకోథెరపుటిక్స్ స్టడీ ప్రకారం ఆర్టిఫీషియల్ స్వీట్నర్స్ వల్ల బరువు పెరగడంతో పాటు, బ్రెయిన్ ట్యూమర్, బ్లాడర్ క్యాన్సర్ సమస్యలొ స్తాయని తేలింది. అందుకే వీటికి బదులు తేనె వాడటం మంచిదంటున్నారు మనీషా చోప్రా.
