Trisha Krishnan: రాజకీయాల్లోకి త్రిష కృష్ణన్? జయలలిత తరహా బిరుదుతో కొత్త సంస్థ ఏర్పాటు!

Trisha Krishnan: రాజకీయాల్లోకి త్రిష కృష్ణన్? జయలలిత తరహా బిరుదుతో కొత్త సంస్థ ఏర్పాటు!

దక్షిణాది స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ పేరు మరోసారి తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తన నటన, అందంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. అయితే ఈ బ్యూటీ.. త్వరలో రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతుందా? తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌తో కలిసి రాజకీయ ప్రస్థానం ప్రారంభించబోతుందా? అంటే  ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అవుననే అనుమానాలకు తావిస్తున్నాయి. లేటెస్ట్ గా ఆమె అభిమానులు తీసుకున్న ఓ నిర్ణయం తమిళ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపింది.

తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో త్రిష పేరు మీదుగా 'ఇళయ పురట్చి తలైవి త్రిష పేరవై' (యువ విప్లవ నాయకురాలు త్రిష సంఘం) పేరుతో కొత్త సంస్థను ప్రారంభించారు. ఈ పేరులోని 'పురట్చి తలైవి' అనే పదం మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలితకు అభిమానులు ఇచ్చిన బిరుదును గుర్తుచేస్తోంది. 'ఇళయ' అంటే యువ అని అర్థం. దీంతో త్రిషకు కూడా జయలలిత తరహాలో రాజకీయ గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నమా? అనే కొత్త చర్చ మొదలైంది.

ఈ సంస్థను ప్రారంభించిన సమన్వయకర్త రాజగోపాల్ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ఉచిత న్యాయ సహాయం వంటి సేవలు చేపట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు. త్రిష రాజకీయాల్లోకి రావాలని, ముఖ్యమంత్రి విజయ్‌తో కలిసి పనిచేయాలని తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. అయితే ఈ సంస్థకు త్రిష అనుమతి ఉందా? ఆమె అధికారికంగా ఇందులో భాగమయ్యారా? అనే విషయాలపై స్పష్టత లేదు. రాజకీయ ప్రవేశంపై కూడా ఆమె ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

ALSO READ : పెళ్లి కంటే ప్రశాంతతే ముఖ్యం.. మనసులో మాట చెప్పిన నిత్యామీనన్!

మరోవైపు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి త్రిష హాజరుకావడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. విజయ్ తల్లిదండ్రులను కూడా ఆమె పలకరించారు. వీరిద్దరి మధ్య సాన్నిహిత్యంపై ఇప్పటికే అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దాదాపు 27 ఏళ్లుగా సినీ రంగంలో కొనసాగుతున్న త్రిష.. ఇటీవల సూర్యతో కలిసి 'కరుప్పుసలోనూ కనిపించారు. ప్రస్తుతం తమిళం, తెలుగు చిత్రాల్లో నటిస్తోంది. మరి ఈ కొత్త పేరవై కేవలం అభిమానుల సేవా కార్యక్రమాలకే పరిమితమవుతుందా? లేక త్రిష రాజకీయ అరంగేట్రానికి తొలి అడుగు అవుతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది..