బంగాళాఖాతంలో మరో తుఫాను ముప్పు.. ఏపీ, తెలంగాణకు అలర్ట్?

బంగాళాఖాతంలో మరో తుఫాను ముప్పు.. ఏపీ, తెలంగాణకు అలర్ట్?

* బంగాళాఖాతంలో మరో తుఫాను ముప్పు?
* 26, 27 తేదీల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం!
* ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంపై కొనసాగుతున్న ఆవర్తనం
* ఈ నెల 26, 27 తేదీల్లో అల్పపీడనంగా బలపడే సూచనలు
* నెలాఖరుకు తుఫానుగా మారే అవకాశం ఉందన్న అంచనాలు
* ఏపీ, తెలంగాణలో స్వల్పంగా తగ్గనున్న చలి తీవ్రత

Cyclone Alert: బంగాళాఖాతంలో మరో తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంటుంది. ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్ర పరిసరాల్లో ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ వ్యవస్థ ఈ నెల 26, 27 తేదీల నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ప్రాథమిక అంచనాలు వెలువడుతున్నాయి. నెలాఖరుకు తుఫానుగా బలపడే ఛాన్స్ ఉందన్న అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో ఏపీ, తెలంగాణ ప్రజలు వాతావరణ మార్పులపై దృష్టి సారించాల్సి ఉంది. కానీ తుఫాన్ ఏర్పడటం, దాని తీవ్రత, దిశ, తీరం దాటే ప్రాంతంపై ఇప్పుడే స్పష్టత లేదు.

ఏపీ, తెలంగాణలో వాతావరణం:  

ఈరోజు (సోమవారం, నవంబర్ 23, 2026) రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేఘాల ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని, తూర్పు రాయలసీమలో సాయంత్రం అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణా శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మేఘాల కారణంగా రాత్రిపూట చలి తీవ్రత స్వల్పంగా తగ్గవచ్చని తెలుస్తోంది.