India A vs Pakistan A Clash : ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 (Rising Stars Asia Cup 2026) లో దోహా వేదికగా ఆదివారం (నవంబర్ 22, 2026) నాడు భారత్-ఏ vs పాకిస్థాన్-ఏ మధ్య జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో పరుగుల కంటే మైదానంలో ఆటగాళ్ల మధ్య కొనసాగిన మాటల యుద్ధమే (Sledging & Heated Exchanges) ఇప్పుడు క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. మ్యాచ్ ఆసాంతం పాకిస్థాన్ ఆటగాళ్లు కవ్వింపు చర్యలకు దిగుతూ ఇండియన్ యువ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, హర్షిత్ రాణాలను ఎగతాళి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనికి భారత ఆటగాళ్లు కూడా అంతే ధీటుగా బదులివ్వడంతో మైదానంలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
అభిషేక్, వైభవ్లపై పాక్ ప్లేయర్ల కవ్వింపులు..
భారత జట్టు బ్యాటింగ్ చేసే సమయంలో పాకిస్థాన్ ఫీల్డర్లు, బౌలర్లు పదే పదే ఇండియన్ బ్యాటర్ల ఏకాగ్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నించారు.
వైభవ్ ఆగ్రహం: 15 ఏళ్ల యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఔటై పెవిలియన్‌కు వెళ్తున్న సమయంలో పాక్ ఆటగాళ్ల వైపు సీరియస్‌గా తీక్షణంగా చూస్తున్న దృశ్యాలు కెమెరాల్లో కనిపించాయి. వాస్తవానికి, క్రీజులో ఉన్న మరో ఓపెనర్ అభిషేక్ శర్మను పాక్ ఆటగాళ్లు కవ్విస్తూ ఎగతాళి చేయడంతోనే సూర్యవంశీ తీవ్ర ఆగ్రహంతో వారి వైపు గుర్రుగా చూశాడు.
హర్షిత్ రాణాని సైతం వదల్లేదు: లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు వచ్చిన హర్షిత్ రాణాని సైతం పాక్ బౌలర్లు, ఫీల్డర్లు మాటలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.
కొట్టుకోవడానికి పోయిన హర్షిత్ రాణా vs సుఫ్యాన్ మోకిమ్ :
భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌లో అత్యంత ఉద్రిక్త పరిస్థితి భారత పేసర్ హర్షిత్ రాణా, పాక్ స్పిన్నర్ సుఫ్యాన్ మోకిమ్ మధ్య చోటుచేసుకుంది.
* తొలి ఇన్నింగ్స్ నుంచే వాడివేడిగా: పాకిస్థాన్-ఏ బ్యాటింగ్ చేస్తున్నప్పుడే హర్షిత్ రాణాకు, పాక్ ఓపెనర్లకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆయుష్ బదోని బౌలింగ్‌లో పాక్ ఓపెనర్ షమిల్ హుస్సేన్ క్యాచ్ పట్టిన తర్వాత రాణా అతడికి ఎగతాళ్లి చేస్తూ సెండాఫ్ ఇచ్చాడు.
* 45వ ఓవర్లో పీక్స్‌కు చేరిన ఉద్రిక్తత: భారత జట్టు చేజింగ్ లో 45వ ఓవర్లో హర్షిత్ రాణా డకౌట్ అయి డ్రెస్సింగ్ రూమ్ వైపు నడుస్తుండగా, పాక్ స్పిన్నర్ సుఫ్యాన్ మోకిమ్ ఏదో కామెంట్స్ చేస్తూ అగ్రెసివ్ సెండాఫ్ ఇచ్చాడు. దీంతో హర్షిత్ రాణా వెనక్కి తిరిగి గట్టిగానే బదులివ్వగా, ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పరిస్థితి చేయి దాటకుండా పాకిస్థాన్ ఆటగాళ్లు మోకిమ్‌ను బలవంతంగా పక్కకు లాక్కెళ్లాల్సి వచ్చింది.
తిలక్ శతకం, అభిషేక్ 70 వృథా:
* ఉద్రిక్తతల నడుమ జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్-ఏ 48 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
* పాకిస్థాన్-ఏ (313 ఆలౌట్): ఓపెనర్లు మాజ్ సదాకత్ (59), షమిల్ హుస్సేన్ (33) 66 పరుగుల శుభారంభం ఇవ్వగా, హసన్ నవాజ్ (79 పరుగులు; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో పాక్ 313 పరుగులు చేసింది.
ALSO READ : భారత్‌పై గెలిచాం.. ఈ విజయం మా అండర్–19 జట్టు కోసమే
* భారత్-ఏ (265 ఆలౌట్): 314 పరుగుల లక్ష్య ఛేదనలో అభిషేక్ శర్మ కేవలం 42 బంతుల్లో 70 పరుగులు (6 ఫోర్లు, 6 సిక్సర్లు) బాది పాక్ బౌలర్లకు బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు. కెప్టెన్ తిలక్ వర్మ అద్భుత సెంచరీ సాధించినా, మిగతా బ్యాటర్లు విఫలమవడంతో భారత్-ఏ 265 పరుగులకే ఆలౌటైంది.
