జ్యోతిష్యం:40 రోజుల పాటు శుక్రుని ఆశీస్సులు.. ఐదు రాశుల వారికి గోల్డెన్ డేస్..

జ్యోతిష్యం:40 రోజుల పాటు శుక్రుని ఆశీస్సులు.. ఐదు రాశుల వారికి గోల్డెన్ డేస్..

జ్యోతిష్యంలో శుక్రుడికి ప్రత్యేక స్థానం ఉంది. శుక్రుడు ప్రేమ, మనోజ్ఞత, అందం, సంపద, సౌకర్యం, సంబంధాలు, మాధుర్యం , ఆనందానికి కారకుడు. శుక్రుడు మంచి స్థితిలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి జీవితంలో తేలిక, సంతోషం మరియు ఆకర్షణ పెరుగుతుంది. అంతటి ప్రభావం కలిగిన శుక్రుడు 2026 నవంబర్​ 22  వ తేది సాయంత్రం 5.21  గంటలకు తన స్వంత రాశి అయిన తులారాశిలోకి ప్రవేశించాడు అదే రాశిలో 40 రోజుల పాటు అంటే  2027 జనవరి 1 వ తేది వరకు సంచరిస్తాడని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  ఈ ప్రభావంతో ఆరురాశుల వారికి గోల్డెన్​ పిరియడ్​ అని పండితులు చెబుతున్నారు . ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం. . .! 

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు  ధనం, ఐశ్వర్యం, ప్రేమ, వివాహం, భౌతిక సుఖాలకు కారకుడిగా భావిస్తారు. నవంబర్​ 22 వ తేది సాయంత్రం శుక్రుడు సొంత రాశి తులారాశిలోకి ప్రవేశించాడు. ఈ ప్రభావంతో ఐదు రాశుల వారికి  ఉద్యోగంలో పురోగతి లభించే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. 

మిథున రాశి:  శుక్రుడు తులారాశిలో సంచారం వలన ఈ రాశి వారికి అనేక ప్రయోజనాలు కలగనున్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  వ్యాపారస్తులకు అన్ని విధాల​ అనుకూలంగా ఉంటుంది.  మంచి లాభాలు రానున్నాయి. గతంలో  రావాల్సిన బకాయిలన్నీ దక్కుతాయి. కెరీర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారు. ఈ కాలంలో మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. పూర్వీకుల ఆస్తి కలసి వస్తుంది.  ఆర్దికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  పెళ్లి కోసం ఎదురుచూసే వారు గుడ్​ న్యూస్​ వింటారు. . ప్రేమ వ్యవహారంలో  చిన్నపాటి విభేదాలు సర్దుకుంటాయి.కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాలను దర్శించే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

కర్కాటక రాశి:   ఈ రాశి  వారికి శుక్రుడు తులా రాశిలో సంచారం  ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఉన్నతాధికారులనుంచి ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది.  వ్యాపారస్తులకు అన్ని విధాలా బాగుంటుంది.  కొత్తగా వ్యాపార లాభాలు పెరుగుతాయి. పెట్టుబడుల ద్వారా మంచి ఫలితాలుంటాయి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి అవకాశం రావచ్చు. ఉద్యోగస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. తోటి ఉద్యోగుల సహకారం పుష్కలంగా ఉంటుంది. కొత్త ఒప్పందాలు, భాగస్వామ్యాలు ఏర్పడే అవకాశముంది. సుఖసమృద్ధి, ఐశ్వర్యం పెరిగి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే సందర్భాలు ఏర్పడతాయి. గతంలో చేసిన శ్రమకు తగిన ఫలితం ఈ సమయంలో దక్కుతుంది. కొత్త వాహనం కొనే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులతో ఉన్న పాత మనస్పర్థలు తొలగిపోతాయి.

కన్య రాశి: తులారాశిలో శుక్రుడు సంచారం వలన ఈ రాశి వారి జీవితం మరింత సంతోషంగా మారనుంది. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరిగి, ధ్యానం, పూజలు వంటి వాటిపై మనస్సు మళ్లుతుంది. ఉద్యోగ రంగంలో పురోగతి కనిపిస్తుంది. కొత్త అవకాశాలు రావడంతో కెరియర్‌లో ఎదుగుదల సాధ్యమవుతుంది. ఆర్థికంగా స్థిరత్వం లభించి, ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. వ్యాపారులకు పాత పరిచయాల ద్వారా లాభం చేకూరుతుంది.గతంలో ఇబ్బంది ఎదుర్కొన్న వారు ఇప్పుడు ఆ సమస్యల నుంచి బయటపడతారు. చేపట్టిన పనుల్లో విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు చేతికి అందే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.  ప్రేమ వ్యవహారం సాఫీగా సాగిపోతుంది. 

తులా రాశి:  శుక్రుడు సొంత రాశిలోకి సంచారం వలన ఈ రాశి  వారికి విశేషంగా కలిసొస్తుంది.వృత్తి, వ్యాపారంలో అనుకోకుండా లాభాలు చేకూరతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది. ప్రేమ, వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది.  గతంలో రావలసిన బకాయిలు వసూలవుతాయి.  ఇంట్లో శుభకార్యాలుజరిగే అవకాశం ఉంది. కుటుంబంలో సమస్యలు, ఒత్తిళ్లు బాగా తగ్గి సుఖ సంతోషాలు పెరుగుతాయి. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది.   వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి. ఆర్థికంగా బలపడతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.బంధువర్గంలో మంచిపెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారం కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు. 

ధనుస్సు రాశి: శుక్రుడు తులారాశిలోలో సంచారం వలన ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి.  ఆదాయం క్రమంగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కీలక బాధ్యతలు పోషించాల్సి ఉంటుంది.  కార్యాలయంలో ఉన్నతాధికారులు అండదండలు పుష్కలంగా ఉంటాయి.  కొత్త ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. ముఖ్యమైన ఒప్పందాలు, కాంట్రాక్టులు లాభదాయకంగా మారవచ్చు. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశముంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.నిరుద్యోగులకు సంబంధించిన శుభవార్తలు కుటుంబ ఆనందాన్ని మరింత పెంచుతాయి.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.