IND vs PAK Asia Cup Rising Stars: భారత్-ఎపై పాక్ భారీ స్కోర్.. తిలక్ సేన టార్గెట్ ఎంతంటే..?

IND vs PAK Asia Cup Rising Stars: భారత్-ఎపై పాక్ భారీ స్కోర్.. తిలక్ సేన టార్గెట్ ఎంతంటే..?

ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో భాగంగా ఇండియా-ఏతో జరుగుతోన్న మ్యాచులో పాకిస్తాన్-ఏ 49.2 ఓవర్లలో 313 పరుగులకు ఆలౌటైంది. హసన్ నవాజ్ (79), మాజ్ సదాఖత్ (59), ఫర్హాన్ యూసఫ్ (56) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం టీమిండియా 314 పరుగుల భారీ లక్ష్యంతో చేజింగ్ మొదలుపెట్టింది.

దోహాలోని వెస్ట్ ఎండ్ పార్క్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచులో దాయాది పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్స్ షమీల్ హుస్సేన్ (33), మాజ్ సదాఖత్ (59) జట్టుకు శుభారంభాన్ని అందించారు. 

వికెట్ కీపర్ రోహైల్ నజీర్ డకౌట్ తీవ్రంగా నిరాశపర్చాడు. హసన్ నవాజ్ (79), ఫర్హాన్ యూసఫ్ (56) హాఫ్ సెంచరీలతో రాణించి జట్టు భారీ చేయడంలో కీలక పాత్ర పోషించారు. కెప్టెన్ అబ్దుల్ సమద్ (28), మహ్మద్ ఇమ్రాన్ రంద్వా (23) పర్వాలేదనిపించారు. 

భారత బౌలర్లలో ప్రిన్స్ యాదవ్, హర్షిత్ రాణా, సూర్యాంశ్ షెడ్గే, విప్రజ్ నిగమ్ తలా రెండు వికెట్లు తీశారు. ఆయుశ్ బదోని ఒక వికెట్ సాధించాడు. అనంతరం టీమిండియా 314 పరుగుల భారీ లక్ష్య చేధనను మొదలుపెట్టింది. 

కెప్టెన్ తిలక్ వర్మకు గాయం:

పాకిస్తాన్‎తో జరుగుతోన్న మ్యాచులో భారత ఏ కెప్టెన్ ఫీల్డింగ్ తిలక్ వర్మ గాయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయం కావడంతో తిలక్ మైదానం వీడాడు. దీంతో తిలక్ బ్యాటింగ్‎కు దిగుతాడా లేదా అన్నది చూడాలీ. కొండంత లక్ష్యం ముందున్న వేళ గాయం కారణంగా తిలక్ బ్యాటింగ్‎కు రాకపోతే టీమిండియాకు భారీ ఎదురు దెబ్బే.