సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వెడ్డింగ్ రిసెప్షన్ చెన్నైలో గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. సినీ, క్రికెట్, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకకు హాజరై సందడి చేశారు.. తమిళనాడు రాజకీయ, సినీ రంగాల అగ్రతారల రాకతో ఈ వేడుక మరింత ప్రత్యేకంగా మారింది. ముఖ్యమంత్రి విజయ్ నుంచి సూపర్‌స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ వరకు ప్రముఖులంతా ఒకే వేదికపై కనిపించడం అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ వేడుక దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
నవంబర్ 11న గ్రీస్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్న అనిరుధ్, కావ్య.. నవంబర్ 21న చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భారీ పోలీసు భద్రత మధ్య హాజరయ్యారు. ఆయన రాకతో హోటల్ పరిసరాల్లో సందడి నెలకొంది. విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ కూడా ఈ వేడుకకు వచ్చారు.
காவியா கலாநிதி மாறன் - அனிருத் ரவிச்சந்தர் திருமண வரவேற்பு விழாவில் தமிழ்நாடு முதலமைச்சர் விஜய் #SunNews | #KaviyaMaran | #Anirudh | #KaviyaAnirudhReception | @CMOTamilnadu https://t.co/nChMMS7YXa
— Sun News (@sunnewstamil) November 21, 2026
మరోవైపు సూపర్‌స్టార్ రజనీకాంత్, మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఒకేచోట కలుసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్టాలిన్ తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి వేడుకకు హాజరయ్యారు. ఇద్దరు ప్రముఖులు రజనీకాంత్‌తో ఆత్మీయంగా మాట్లాడుకున్న దృశ్యాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
#EXCLUSIVE | காவியா கலாநிதி மாறன் - அனிருத் ரவிச்சந்தர் திருமண வரவேற்பு விழாவில்.. #SunNews | #KaviyaMaran | #Anirudh | #KaviyaAnirudhReception https://t.co/QQ09dDmY12
— Sun News (@sunnewstamil) November 21, 2026
ఇక యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కూడా ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనిరుధ్‌తో ఆయనకు మంచి అనుబంధం ఉంది. కమల్ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ 'విక్రమ్'కు అనిరుధ్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కొత్త జంటతో కలిసి కమల్ వేదికపై కనిపించడం అభిమానులకు కనువిందు చేసింది.
#EXCLUSIVE | காவியா கலாநிதி மாறன் - அனிருத் ரவிச்சந்தர் திருமண வரவேற்பு விழாவில் #SunNews | #KaviyaMaran | #Anirudh | #KaviyaAnirudhReception https://t.co/NlMdMymEk0
— Sun News (@sunnewstamil) November 21, 2026
తమిళ చిత్ర పరిశ్రమ నుంచి నిర్మాత కలైపులి ఎస్. థాను, నటుడు ప్రభు, దర్శకుడు ధరణి, నటి రాధికా శరత్‌కుమార్ కూడా హాజరయ్యారు. రజనీకాంత్ కుమార్తె సౌందర్య తన భర్త విశాగన్, పిల్లలతో కలిసి వేడుకకు వచ్చారు. ఆమె అనిరుధ్‌కు దగ్గరి బంధువు కావడంతో కుటుంబ సభ్యుల కలయిక ప్రత్యేకంగా నిలిచింది. డీఎంకే ఎంపీ కనిమొళి కూడా ఈ వేడుకలో సందడి చేశారు.
காவியா கலாநிதி மாறன் - அனிருத் ரவிச்சந்தர் திருமண வரவேற்பு விழாவில் நடிகை ராதிகா #SunNews | #KaviyaMaran | #Anirudh | #KaviyaAnirudhReception https://t.co/4gvTzK04sK
— Sun News (@sunnewstamil) November 21, 2026
మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ సైతం కావ్య మారన్ తల్లిదండ్రులు కళానిధి మారన్, కావేరి మారన్‌లకు ప్రత్యేక లేఖ పంపి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. జీవితాంతం ప్రేమ, స్నేహం, ఆనందంతో కలిసి ఉండాలని ఆకాంక్షించారు. మహేశ్ బాబు, సిద్ధార్థ్, అదితి రావు హైదరీ, కేన్ విలియమ్సన్, డేనియల్ వెటోరీ, డేల్ స్టెయిన్ వంటి ప్రముఖులు ఈ వేడుకకు హాజరై కొత్త దంపతులకు విషెస్ తెలిపారు.
అనిరుధ్-కావ్యల రిసెప్షన్ కేవలం ఓ వివాహ వేడుకగానే కాకుండా.. దక్షిణాది సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల కలయికగా మారింది. ముఖ్యంగా విజయ్, రజనీకాంత్, కమల్ హాసన్, స్టాలిన్ వంటి హేమాహేమీలు ఒకే వేడుకలో కనిపించడంతో ఈ రిసెప్షన్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి...
