వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఎప్పటికప్పుడు తమ స్థానాలను మారుతుంటాయి. ఇలా మారినప్పుడు దాని ప్రభావం అన్ని రాశుల వారి జీవితాల పైన కనిపిస్తుంది. గ్రహాలకు రాజు అయిన సూర్యభగవానుడు ధనుస్సురాశిలో 2026 మధ్యాహ్నం 12:53 గంటలకు ప్రవేశించనున్నాడు. అదే రాశిలో డిసెంబర్ 21వ తేది వరకు కొనసాగుతాడు. సూర్య సంచారంలో మార్పు వలన ఏరాశి వారికి ఎలా ఉంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .
నూర్యుడు ధనస్సు రాశిలో సంచారంతో లాభపడే రాశులు
మేషరాశి: సూర్యుడు ధనస్సు రాశిలో సంచారం వలన ఈ రాశి వారికి గ్రహబలం పెరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో అత్యధికంగా లాభం పొందడం జరుగుతుంది. సమాజంలో ప్రముఖులతో సంబంధాలు ఏర్పడతాయి. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. దాంపత్య సమస్యలు తొలగిపోయి, అన్యోన్యత పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు ఆర్థికంగా కలసి వస్తుంది. విదేశాల్లో ఉద్యోగం కోసం ఎదురు చూసే వారు గుడ్ న్యూస్ వింటారు. ఉద్యోగస్తులకు వేతనం పెరిగే అవకాశం ఉంటుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. వ్యాపారస్తులకు అన్ని విధాలుగా కలసి వస్తుంది. గతంలో చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఫలిస్తాయి. కొత్తగా పెట్టుబడులు పెడితే ఆర్థిక లాభాలు కలసి వస్తాయి. ఈ సమయంలో మీరు తీసుకొనే నిర్ణయం లైఫ్టర్నింగ్ పాయింట్ అవుతుంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
సింహరాశి: ధనస్సు రాశిలో సూర్యుడి సంచారం వలన ఈ రాశి వారికి సృజనాత్మకత పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. గతంలో ఇచ్చిన అప్పులు తిరిగి రావడానికి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. విదేశాలలో ఉద్యోగం చేసే వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. పని ఒత్తిడి.. శ్రమ అధికం అవుతుంది. కొత్తగా ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. పూర్వీకుల ఆస్తికి సంబంధించి వివాదాలు పరిష్కారమవవుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రమోషన్ రావడంతో పాటు వేతనం పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు, పిల్లలకు సంబంధించిన విషయాల్లో శుభవార్తలు వింటారు.
ధనుస్సురాశి: ఇదే రాశిలో సూర్యుని సంచారం వలన ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు రెట్టింపయ్యే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త ఒప్పందాలు కుదుర్చుకొనే అవకాశం ఉంది. గతంలో ఆగిపోయిన పనులను తిరిగి చేపడతారు.ఆర్థికంగా స్థిరపడే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. సమాజంలో గౌరవం.. కీర్తి.. ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ తో వేతనం పెరిగే అవకాశం ఉంది. కేరీర్ లో ఉన్నతస్థానాన్ని పొందుతారు. ఇప్పటి వరకు మిమ్మలను వ్యతిరేకించిన వారే మీ సహాయాన్ని అర్దిస్తారు. ఆకస్మికంగా ధనలాభం పొందుతారు. ప్రేమ.. పెళ్లి మొదలగు అంశాలు కలసి వస్తాయి.
కుంభరాశి : ధనస్సు రాశిలో సూర్య సంచారం వలన ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు, స్నేహితుల సహకారం లభిస్తాయి. దీర్ఘకాలిక కోరికలు నెరవేరే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. గ్రహాలు అనుకూలత వలన సానుకూల శక్తి పెరిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో సంతోషం నెలకొంటుంది. మీరు తల పెట్టిన పనులు సులభంగా పూర్తవుతాయి. ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయి. మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది. సంతానం కోసం ఎదురు చూసే వారు శుభవార్త వింటారు. వ్యాపారస్తులకు అధికంగా లాభాలు వస్తాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు చాలా అనుకూలంగా ఉంది. కొత్తగా ఇల్లు కట్టేందుకు అంకురార్పణ చేసే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. సహోద్యోగల అండదండలు ఉంటాయి. మీ బాస్ మీకు కొన్ని కీలకమైన పనులు అప్పగించే అవకాశం ఉంటుంది. ఇది మీ లైఫ్ నకు టర్నింగ్ పాయింట్ కూడా అవ్వవచ్చు. కాబట్టి అదనపు బాధ్యతలను ఇష్టంగా స్వీకరించండి. ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
మిశ్రమ ఫలితాలు ఉండే రాశులు
మిథునరాశి: ధనస్సు రాశిలో సూర్యుడు సంచారం వలన ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనుకున్న పనులు కొంచెం నిదానంగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఖర్చులు పెరుగుతాయి. కెరీర్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నిరుద్యోగులకు జాబ్ ఆఫర్లు వస్తాయి. శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పండితులు చెబుతున్నారు. వ్యాపారస్తులు కష్ట పడాల్సి ఉంటుంది. కొత్తగా ఎలాంటి పెట్టుబడులు పెట్టవద్దని పండితులు సూచిస్తున్నారు. ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ల విషయంలో జాగ్రత్తలు పాటించండి. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
కన్య రాశి: సూర్య గ్రహ సంచారంలో మార్పు వలన ఈ రాశి వారు కొత్తగా పెట్టుబడులు పెట్టేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే పెట్టుబడి పెట్టిన సొమ్ము నష్టపోయే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు కొత్త ప్రాజెక్టులు... కొత్త బాధ్యతలు తీసుకొనే అవకాశం కలదు. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు కూడా పెరుగుతాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టేవిషయాన్ని వాయిదా మంచిది. కుటుంబ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది.ఎవరితోనూ ఎలాంటి వాదనలు పెట్టుకోవద్దు. ప్రేమ విషయాలు కూడా వాయిదా వేయడం వేసుకోవడం మంచిదని పండితులు సూచిస్తున్నారు.
తులారాశి:ధనస్సురాశిలో సూర్యుడు సంచారం వలన ఈ రాశి రాశి వారికి మిశ్రమ ఫలితాలుంటాయి ఆర్థిక పరంగా సమస్యలు వచ్చినా అధికమిస్తారు. అనవసరంగా ఖర్చులు పెరుగుతాయి. కెరీర్ పరంగా కొన్ని ఆటంకాలు కలుగుతాయి. . ఆర్థిక విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. మీలో మీరే కూర్చుని పరిష్కరించుకోండి.. మూడో వ్యక్తి దగ్గరకు పరిష్కారం కోసం వెళ్లవద్దని పండితులు సూచిస్తున్నారు. ప్రేమ.. పెళ్లి విషయాలను వాయిదా వేసుకోండి. ప్రేమికులు ఎలాంటి సంభాషణలు.. మీటింగ్ లు పెట్టుకోకపోవడమే మంచిది. ఉద్యోగస్తులు ఎక్కువ సమయం పనిచేయాల్సి ఉంటుంది. ప్రతి విషయంలోనూ ఓర్పు .. సహనం పాటించండి.. చివరకు అంతా మంచే జరుగుతుంది. ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని పండితులు సూచిస్తున్నారు.
మీనరాశి: సూర్యుడు ధనస్సురాశిలో సంచారం వలన ఈ రాశి వారు కొత్త సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. ఎలాంటి పరిస్థితులు వచ్చినా.. ప్రశాంతంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.. నిదానంగా పరిస్థితులు అనుకూలంగా మారతాయి. ఆర్థిక పరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు చాలా సమయం ఓపికగా ఉండాలి. విదేశీ ప్రయాణం.. వ్యాపారానికి సంబంధించిన విషయాలు అనుకూలంగా మారతాయి. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నిదానంగా ప్రతికూలత ప్రభావం తగ్గడంతో ..కొంత ఉపశమనం కలుగుతుంది.పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఉద్యోగంలో గుర్తింపురావడంతో కొంత ఊరట కలుగుతుంది.
జాగ్రత్తగా ఉండాల్సిన రాశుల వారు వీరే
వృషభరాశి: ధనస్సు రాశిలో సూర్యుడు సంచరించడం వలన ఈ రాశి వారికి కెరీర్ విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారు చాలా ఓపికకగా ఉండాలి. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అనవసరమైన విషయాల జోలికి వెళ్లవద్దు. ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఎదురవుతాయి. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. ఆరోగ్య పరంగా కూడా సమస్యలు ఉంటాయి. ఉద్యోగస్తులు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టవద్దని పండితులు సూచిస్తున్నారు..
కర్కాటకరాశి: ధనస్సు రాశిలో సూర్యుడు సంచారం వలన ఈ రాశి వారికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే పెట్టుబడి పెట్టిన సొమ్ము నష్టపోయే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు కొత్త ప్రాజెక్టులు... కొత్త బాధ్యతలు తీసుకొనే అవకాశం కలదు. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు కూడా పెరుగుతాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టేవిషయాన్ని వాయిదా మంచిది. .ఎవరితోనూ ఎలాంటి వాదనలు పెట్టుకోవద్దు. ప్రేమ విషయాలు కూడా వాయిదా వేయడం వేసుకోవడం మంచిదని పండితులు సూచిస్తున్నారు.
వృశ్చికరాశి : సూర్యుడి సంచారంలో మార్పు వలన ఈ రాశి వారికి ప్రతి విషయం ఛాలెంజ్‌గా ఉంటుంది. వ్యాపారం కూడా కొన్ని మార్పులు వస్తాయి. ఉద్యోగస్తులు అనవరంగా మాట పడతారు. అందరిని గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. ఎవరితోనూ వాదనలు పెట్టుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు ఏర్పడుతాయి. ఆస్తుల మధ్య వివాదాలు వస్తాయి. ముఖ్యంగా మానసికంగా, శారీరకంగా అనేక సమస్యలు పెరుగుతాయి. మీ కుటుంబంలో కలహాల వల్ల సంతోషం ఉండదు. స్థిరాస్తులకు సంబంధించి అనేక సమస్యలు ఎదురవుతాయి.
మకరరాశి:సూర్యుడు ధనస్సురాశిలో సంచారం వలన ఈ రాశి రాశి వారికి ఆర్థిక పరంగా సమస్యలు ఏర్పడుతాయని పండితులు చెబుతున్నారు. అనవసరంగా ఖర్చులు పెరుగుతాయి. కెరీర్ పరంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడుతాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. మీలో మీరే కూర్చుని పరిష్కరించుకోండి.. మూడో వ్యక్తి దగ్గరకు పరిష్కారం కోసం వెళ్లవద్దని పండితులు సూచిస్తున్నారు. ప్రేమ.. పెళ్లి విషయాలను వాయిదా వేసుకోండి. ప్రేమికులు ఎలాంటి సంభాషణలు.. మీటింగ్ లు పెట్టుకోకపోవడమే మంచిది. ఉద్యోగస్తులు ఎక్కువ సమయం పనిచేయాల్సి ఉంటుంది. ప్రతి విషయంలోనూ ఓర్పు .. సహనం పాటించండి..
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
