హిందువులకు అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ ఏడాది కార్తీక పౌర్ణమి నవంబర్ 24 వ తేది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అద్భుతమైన రెండు యోగాలు ఏర్పడుతాయి. చంద్రుడు వృషభ రాశిలో సంచారం.. కుజుడు, గురుడు సంచారం వలన చంద్రమంగళయోగం... గజకేసరియోగం ఏర్పడనున్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ శుభ యోగాల ప్రభావంతో ఆరు రాశుల వారికి (వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, కుంభ) మహర్ధశ పడుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం. . .!
వృషభరాశి: కార్తీక పౌర్ణమి రోజు రెండు అద్భుతమైన యోగాలు ఏర్పడటం వలన ఈ రాశి వారి మనసులోని కోరికలు చాలా వరకు నెరవేరుతాయి. ఏ కార్యక్రమం చేపట్టినా ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తవుతుంది. చంద్రమంగళ, గజకేసరి యోగం వలన ఈ రాశి వారికి డబ్బు పరంగా అభివృద్ది ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.చేతి వృత్తుల వారికి అనుకోని లాభాలు వస్తాయి. పూర్వీకుల ఆస్థి చేతికి రావడంతో ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడటం ప్రారంభిస్తుంది.ఈ సమయంలో మీ పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీకు కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయి. దీంతో పాటు సామాజిక రంగాల్లో మీకు గౌరవం కూడా పెరుగుతుంది. ఈ కాలంలో మీరు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలను సాధిస్తారు.ఉద్యోగస్తులకు వేతనం పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
కర్కాటకరాశి: కార్తీక పౌర్ణమి.. నవంబర్ 24 వ తేదీన ఏర్పడే రెండు అద్భుతమైన యోగాల ప్రభావంతో ఈ రాశి వారికి అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. ఇంట్లో ఆనందకర వాతావరణం నెలకుంటుంది. మంచి ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఇక ఉద్యోగస్తుల విషయానికొస్తే మంచి పురోగతి ఉంటుంది. వ్యాపారస్తులకు కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. కొత్త ప్రాజెక్టు లేదా ఒప్పందాన్ని ప్లాన్ చేస్తుంటే ఇదే సరైన సమయమని పండితులు చెబుతున్నారు.
కన్యారాశి: కార్తీక పౌర్ణమి రోజు చంద్రుడు ఈ రాశిలో లాభ స్థానంలో సంచరిస్తున్నాడు. దీనివల్ల ఏర్పడే గజకేసరి యోగంతో ఈ రాశి వారికి సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. మీరు మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు. వ్యక్తిగత, వృత్తిపరమైన సంబంధాల్లో మంచి మార్పు కనిపిస్తుంది.చాలా మందికి కెరీర్‌లో మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి అనేక అవకాశాలు ఉంటాయి.వ్యాపారవేత్తలు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగస్తులు ప్రమోషన్లు, కొత్త బాధ్యతలను తీసుకునే అవకాశం ఉంది. వృత్తిపరంగా మీ ఇమేజ్ పెరుగుతుంది.
వృశ్చికరాశి: కార్తీక పౌర్ణమి రోజు కుజుడు.. గురుడు సంచారం వలన ఏర్పడే గజకేసరి యోగం.. చంద్రమంగళ యోగం వలన ఈ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది. . గతంలో నిలిచిపోయిన అనేక పనులు మళ్లీ ఊపందుకుంటాయి. కెరీర్ విషయంలో లైఫ్ టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశాలున్నాయి. . ఉద్యోగులకు ప్రమోషన్ లేదా జీతం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలకు ఈ సమయం పెట్టుబడులకు, వ్యాపార విస్తరణకు అనుకూలంగా ఉంటుంది.మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీరు మానసికంగా కూడా స్థిరంగా ఉంటారు. దీనివల్ల మీరు సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్నట్లయితే.. ఇది అనుకూలమైన సమయమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
మకరరాశి: నవంబర్ 24 వ తేది కార్తీక పౌర్ణమి రోజు ఏర్పడే రెండు యోగాల వలన ఈ రాశి వారికి ఇంటి బయటా ప్రాధాన్యత పెరుగుతుంది. సమాజంలో ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి.కొత్త వస్తువులు కొనే అవకాశం ఉంది. కుటుంబంలో శుభపరిణాలు చోటు చేసుకుంటాయని పండితులు చెబుతున్నారు. చేతి వృత్తుల వారికి.. వ్యాపారస్తులకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. కొత్తగా పెట్టుబడులు పెడితే ఊహించని లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులు అధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు. కొత్త ప్రాజెక్ట్ లకు ఒప్పందం చేసుకుంటారు. జాబ్ మారాలనుకునే వారికి చాలా శుభసమయమని పండితులు చెబుతున్నారు.
కుంభరాశి: కార్తీకపౌర్ణమి రోజు ఈరాశి వారికి కుజుడు.. గురుడు 7వ స్థానంలో సంచరించడం వలన ఈ రాశి వారికి మనసులోని కోరికలు నెరవేరే అవకాశం ఉంది, కొత్తగా ఇంటి నిర్మాణానికి ప్లాన్ వేస్తారు. కుటుంబ సభ్యులు ఆనందంగా గడుపుతారు. ఇక ఆర్థిక విషయానికి వస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆస్తి వివాదాలు సానుకూలపడతాయి. పూర్వీకుల ఆస్థి కలసి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు అన్నీ విధాలుగా బాగుంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు అందుకుంటారు. అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం
